/rtv/media/media_files/2025/01/09/NGrSpF9q4xq5Gq6hWAAm.jpg)
Ponguleti Srinivas Reddy
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్రంలోని 25,65,000 మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే గత వర్షా కాలం సీజన్ కింద క్వింటాకు రూ.500 చొప్పున రూ.1,700 కోట్ల రూపాయలు బోనస్‌గా కూడా చెల్లించామని తెలిపారు. ఇదే కాకుండా రైతు భరోసా కింద రూ.9 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
క్వింటాకు బోనస్ ఇస్తామని..
రెండు పంటల సీజన్లలో మొత్తం 3 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఇందులో సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా నిరుపేదలకు అందజేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో కూడా బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు బోనస్ ఇస్తున్న మొదటి ప్రభుత్వ కూడా దేశంలో ఇదేనని అన్నారు.
ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!
రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పొంగులేటి వెల్లడించారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ కేంద్రంలో కొనుగోలు చేసిన ప్రతీ క్వింటాకు మద్దతు ధరతో బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని తెలిపారు.
ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!
ఇది కూడా చూడండి: KKR VS SRH: మరీ ఇంత దారుణంగానా..ఎస్ఆర్హెచ్ కు ఏమైంది?