/rtv/media/media_files/2025/04/03/N2DT2pLSJ3nEMOOPfO3D.jpg)
Boys Photograph: (Boys)
ఈ మధ్య కాలంలో అబ్బాయిలు చాలా బద్దకంగా తయారు అయ్యారు. కనీసం శారీరక శ్రమ లేకపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అబ్బాయిలు డైలీ వ్యాయామం చేయకుండా, పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైలీ ఈ నియమాలు పాటించకపోతే వారి ఆరోగ్యానికే ప్రమాదమని అంటున్నారు. అయితే ఈ అలవాట్లు పాటించకపోతే అబ్బాయిలకు వచ్చే అనారోగ్య సమస్యలేంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
గుండె జబ్బులు
అబ్బాయిలకు పూర్తిగా శారీరక శ్రమ లేకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల ఎక్కువగా ఈ వ్యాధులు బారిన పడుతున్నారు. వీటివల్ల గుండె ప్రమాదాలు వస్తాయని అంటున్నారు. కాబట్టి డైలీ ఒక 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.
ఇది కూడా చూడండి: UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు
ప్రోస్టేట్ ఆరోగ్యం
చాలా మంది పురుషులకు ఎక్కువగా ప్రోస్టేట్ సమస్య వస్తుంది. ఇది ఎక్కువైతే మాత్రం క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అబ్బాయిలు ముందుగానే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే సమస్య తీవ్రమై ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది.
ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం
మానసిక ఆరోగ్యం
అబ్బాయిలకు మంచి అలవాట్లు లేకపోవడం వల్ల చాలా మంది పురుషులు మానసిక సమస్యల బారిన పడుతున్నారు. చిన్న సమస్యలకు ఒత్తిడికి గురి కావడం, ఆందోళన వల్ల మానసిక సమస్యల బారిన పడుతున్నారు.
స్పెర్మ్ కౌంట్
ఎక్కువగా మద్యపానం, ధూమపానం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కాబట్టి వీటిని తీసుకోకుండా పోషకాలు ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.