/rtv/media/media_files/2025/04/03/CA90j9kvUwut8acVPHNo.jpg)
Dream Astrology
Dream Astrology: నిద్రలో కలలు రావడం మానవ సహజం. పడుకునేటప్పుడు సంతోషంగా ఉంటే ఒక విధంగా, బాధగా, విషాదంగా ఉంటే ఉంటే మరొక విధమైన కలలు వస్తాయి. ఇందంతా మన మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నిద్రలో వచ్చే ప్రతి కల భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను సూచిస్తుందని డ్రీమ్ సైన్స్ నిపుణులు అభిప్రాయం. . అయితే కలలో కొన్ని వస్తువులు కనిపిస్తే మీ అదృష్టం మారబోతున్నట్లు సంకేతం అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
ఈ ఐదు కనిపిస్తే..
గుడ్లగూబ
డ్రీమ్ సైన్స్ ప్రకారం..కలలో గుడ్లగూబను చూడడం శుభసూచకం. ఎందుకంటే గుడ్లగూబను లక్ష్మీ దేవి వాహనంగా పరిగణిస్తారు. ఇకపై లక్ష్మీ దేవి కరుణా కటాక్షం మీపై ఉండబోతుందని నమ్ముతారు. ఆర్ధిక లాభాలు కూడా పొందుతారు.
తెల్లటి స్వీట్లు
తెల్లటి స్వీట్లు చూడటం శుభ సంకేతంగా చెబుతారు. దీని అర్థం మీ జీవితంలో ఆనందం, సంతోషం,సుఖ శాంతులు రాబోతున్నాయని అర్థం. లక్ష్మీ దేవి మీపై తన ఆశీస్సులను కురిపించబోతోంది.
చీపురు..
కలలో చీపురు కనిపించడం శుభ సంకేతంగా చెబుతారు. చీపు చూస్తే మీ అదృష్టం త్వరలో మారబోతుందని సంకేతం.
ఖాళీ పాత్రలు
కలలో ఖాళీ పాత్రలను చూడడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. ఖాళీ పాత్రలు కనిపిస్తే లక్ష్మీ దేవి త్వరలో ఇంటికి రాబోతుందని నమ్ముతారు. అలాగే ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి.
బంగారం,వెండి
కలలో బంగారం, వెండిని చూడటం మరీ అదృష్టంగా భావిస్తారు. దీని అర్థం మీరు భవిష్యత్తులో సంపద, విజయం, శ్రేయస్సును పొందబోతున్నారని. అలాగే మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
ఎలాంటి కలలు రావడం మంచిది కాదు?
కలలో తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు, మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు కలలు రావడం మంచిది కాదని చెబుతారు.
latest-news | life-style | Dream Astrology | latest news telugu
Also Read: Viral News: తల్లికి, బిడ్డకు ఒకేసారి కడుపు చేసిన యూట్యూబర్.. నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రచ్చ రచ్చ!