/rtv/media/media_files/2025/04/03/o0msXPthKy2SbPnQ1UPJ.jpg)
Nick Yardi announced his wife and aunti pregnent news
Nick Yardy: ప్రముఖ యూట్యూబర్ నిక్ యార్డి జనాలను పిచ్చోళ్లను చేశాడు. తన భార్య జాడే, అత్త డానీని ఒకేసారి గర్భవతులను చేసినట్లు తెలిపాడు. వారి బేబీబంప్ ఫొటోలు నెట్టింట షేర్ చేయగా తీవ్ర విమర్శలపాలయ్యాడు. దీంతో ఇదంతా ఏప్రిల్ ఫూల్ అంటూ ప్రకటించాడు.
The most genuine love we’ve ever felt 🤰 pic.twitter.com/tt4ASuDnI3
— Nick Yardy (@nickyardy) March 24, 2025
3.41 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్..
ఈ మేరకు 3.41 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కలిగివున్న 29 ఏళ్ల యూట్యూబర్ నిక్ యార్డీ.. గత నెలలో తన 22 ఏళ్ల స్నేహితురాలు జాడే, ఆమె తల్లి 44 ఏళ్ల తల్లి డానీ తన పిల్లలతో గర్భవతిగా ఉన్నారని ప్రకటించారు. ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ కావడంతో జనాలు దుమ్మెత్తిపోశారు. ఇదేం పద్ధతి అంటూ ట్రోలింగ్ చేశారు. దీంతో మిస్టర్ యార్డీ గర్భం దాల్చిన కథంతా కల్పితమని ఒప్పుకున్నాడు. 'పిల్లలు లేరు. ఇది కేవలం ఒక స్కిట్ లాంటిది. ఇది అసలు నిజం కాదు. ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఇలా చేశాను' అంటూ అందరికీ సారీ చేప్పాడు.
We wouldn’t have it any other way pic.twitter.com/46OaYuioQJ
— Nick Yardy (@nickyardy) March 27, 2025
జమైకాలో జన్మించిన మిస్టర్ యార్డి 2017లో తన సోషల్ మీడియా కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత కొంతకాలానికి గంజాయి నేరారోపణలో ఒక సంవత్సరం జైలు జీవితం గడిపాడు. అప్పటి నుంచి అతను ఓన్లీ ఫ్యాన్స్ మోడల్స్, సోషల్ మీడియా పర్సనాలిటీలతో స్కిట్‌లు, కంటెంట్ క్రియేట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు.
youtuber | wife | mother | pregnent