/rtv/media/media_files/2025/04/12/S16yurtq8FVPQubSwHio.jpg)
China Exports
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఇరు దేశాలు టారిఫ్‌లు పెంచడంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు పెంచింది. మరోవైపు చైనా అమెరికాపై 125 శాతం పెంచింది. చైనాపై ఎక్కువ సుంకాలు ఉండటం వల్ల ఆ దేశ ఎగుమతి ఆధారిత వ్యవస్థ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటోంది. అయితే ఈ టారిఫ్‌లు చైనా ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చైనా ఆర్థిక వ్యవస్థ చాలా ఏళ్లుగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. అయితే చైనాకు అతిపెద్ద మార్కెట్‌లో అమెరికానే కీలకం. 2024లో అమెరికాకు చైనా 440 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతులు చేసింది. ఇది ఆ దేశం మొత్తం ఎగుమతుల్లో చూసుకుంటే 14 శాతం, అలాగే జీడీపీలో 3 శాతం ఉంది. అయితే చైనా దిగుమతులను అరికట్టాలని అమెరికా ముందుగా 10 శాతం నుంచి ఇప్పుడు 145 శాతానికి సుంకాలు పెంచింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, మెషినరీతో పాటు వివిధ రకాల ఉత్పత్తులను టార్గెట్ చేసింది.
Also Read : గిల్ గిలగిల.. పంత్ ముందు టార్గెట్ ఇదే- గెలిచారంటే అగ్రస్థానానికే!
America Tariffs Impact On China Exports
టారిఫ్‌ల ప్రభావం వల్ల చైనా వస్తువులకు అమెరికాలో డిమాండ్ గణనీయంగా పడిపోయింది. దీనివల్ల వచ్చే రెండేళ్లలో అమెరికాకు చైనా ఎగుమతులు 80 శాతం వరకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహణకు చూసుకుంటే చైనా నుంచి అమెరికా దిగుమతుల్లో 9 శాతం ఉన్న స్మార్ట్‌ఫోన్ వంటి ఉత్పత్తులు తీవ్రంగా ధరల పెరుగుదలను ఎదుర్కొంటాయి. దీనివల్ల వాటిని మార్కెట్ నుంచే బహిష్కరించే ఛాన్స్ ఉంటుంది. అలాగే లక్షలాది మంది కార్మికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుంది. చైనాలో దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు అమెరికా సంబంధిత ఎగుమతులపైనే ఆధాపడి ఉన్నాయి.
Also Read: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు
అమెరికా అధిక సుంకాల వల్ల చైనాలో పలు సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపివేశాయి. టెక్స్‌టైల్ కంపెనీలు అమెరికాకు పూర్తిగా తమ ఎగుమతులు నిలిపివేస్తున్నట్లు చెప్పాయి. ఈ టారిఫ్‌ల వల్ల తమ లాభాలు గణనీయంగా క్షీణించాయని వాపోతున్నాయి. తగ్గినటువంటి ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉన్న తయారీ రంగాన్ని చాలా బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తల వల్ల పారిశ్రామికోత్పత్తి కుదేలు కాగా.. మళ్లీ మరింత ఒత్తిడిని ఎదుర్కోనుంది.
అమెరికా సుంకాలను పెంచడం, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల గోల్డ్‌మన్ శాక్స్ 2025లో చైనా జీడీపీ వృద్ధిని 4 శాతానికి సవరించింది. చైనా జీడీపీలో అమెరికాకు చేసే ఎగుమతుల వాటే తక్కువగా ఉన్నప్పటికీ.. తగ్గిన పెట్టుబడులు, వినియోగదారుల సామర్థ్యం వల్ల మరింత ఆర్థిక ఒత్తిడి ఎదురుకానుంది.
Also Read : ఓరి మీ దుంపల్‌తెగ ఆపండ్రోయ్.. అఘోరీ కోసం వర్షిణీ లవ్ సాంగ్- వీడియో
అయితే అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు చైనా మరో మార్గాలను అనుసరిస్తోంది. ఆగ్నేసియా ప్రాంతాల వైపు తమ ఎగుమతులు చేసి అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. 2019 నుంచి ఆగ్నేసియాలో చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తాజా సుంకాల వల్ల వాణిజ్య పరిణామాలు మారుతున్నాయి. ఉదాహరణకు టెక్స్‌టైల్ సంస్థలు తక్కవ వాణిజ్య అవరోధాలు ఉండే మార్కెట్లకే తమ ఎగుమతులు చేస్తున్నాయి. కానీ ఆ మార్కెట్లు తరచుగా తక్కువ మార్జిన్లు అందిస్తాయి.
Also Read: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు
ఇదిలాఉండగా అమెరికా వస్తువులపై చైనా 125 శాతానికి సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఇది సోయాబీన్స్, పంది మాసం వంటి వాటితో సహా ఇంధనాలు, యంత్రాలను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా ఉత్పత్తిదారులపై ఒత్తిడి తీసుకురావాలనే చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక చైనా మినహా మిగతా దేశాలపై అమెరికా 90 రోజుల పాటు టారిఫ్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
US tariffs | rtv-news | telugu-news | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu