/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ring-of-fire-jpg.webp)
శనివారం అరుదైన సూర్య గ్రహణం(Grahanam) ఏర్పడబోతుంది. భారత్ లో దీని ప్రభావం పాక్షికంగానే ఉన్నప్పటికీ ఇది అత్యంత అరుదైన గ్రహణం.
ఈ గ్రహణం మహాలయ పితృపక్ష అమావాస్యతో కలిసి వచ్చింది. ఈ గ్రహణం సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ కూడా కొన్ని దేశాల్లో కనిపించనుంది.
ఈ గ్రహణం భారత్ లో కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో మాత్రమే ప్రజలు పాక్షిక సూర్య గ్రహణాన్ని చూడగలరు. అమెరికా, కెనడా, నికరాగ్వా, బ్రెజిల్ , కొలంబియా వంటి ప్రదేశాల్లో ఈ సూర్య గ్రహణాన్ని చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also read: ఐపీఎస్ ల బదిలీ స్థానాలు భర్తీ..హైదరాబాద్ కి శాండిల్య!
అయితే అమెరికాలో కూడా నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో , సదరన్ టెక్సాస్ వాసులు మాత్రమే రింగ్ ఆఫ్ ఫైర్ ని పూర్తిగా చూడగలరు. భారత్ లో ఈ గ్రహణం..రాత్రి 9 గంటలకు మొదలవుతుంది..అర్థరాత్రి తరువాత అంటే 2.23 నిమిషాల వరకు సూర్యుడు పాక్షికంగా కనిపించకుండా పోతాడు.
ఈ సారి రింగ్ ఆఫ్ ఫైర్ సుమారు 5.17 సెకండ్లు కనిపిస్తుంది. గ్రహణాన్ని నేరుగా చూడవద్దని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేరుగా చూస్తే కంటి చూపు పై ప్రభావం పడుతుంది. గ్రహాణాన్ని బ్లాక్ కలర్ ఫిల్మ్స్ ఉపయోగించి చూడవచ్చు. ఈ సూర్యగ్రహణాన్ని నాసా లైవ్‌లో చిత్రీకరించనుంది. తన అధికారిక వెబ్ సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.
రింగ్ ఆఫ్ ఫైర్ అంటే..
ఈ సారి ఏర్పడేది రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of Fire). అంటే కంకణాకార గ్రహణం అంటే సూర్యుడిని చంద్రుడు పూర్తిగా అడ్డుకున్నప్పుడు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతోంది. ఇలా కాకుండా చంద్రుడు తన కక్ష్యలో భూమి నుంచి దాని సుదూర బిందువు వద్ద ఉన్నప్పుడు ఎన్యూలర్ సూర్య గ్రహణం ఏర్పడుతోంది.
అంటే చంద్రుడు చాలా చిన్నగా కనిపిస్తాడు. చంద్రుడు సూర్యుని వద్ద ఒక డిస్క్ మాదిరిగా కనిపిస్తాడు. ఇది ప్రకాశించే రింగ్ లేదా ” రింగ్ ఆఫ్ ఫైర్ ” ఏర్పడుతుంది. ఈ శనివారం ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్ మళ్లీ 20 ఏళ్లకే అంటే 2043 లోనే ఏర్పడుతుందని నాసా వివరించింది. ఈ శనివారం గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలోని అనేక దేశా్లో కనిపించనుంది.
నాసా (Nasa) ప్రకారం..గ్రహణం ఉదయం 9: 13 గంటలకు స్టార్ట్ అవుతుంది. భారత్ లో అయితే రాత్రి 8.34 గంటలకు మొదల..తెల్లవారు జామున 2.25 గంటలకు ముగుస్తుంది. భారత్ లో ఈ గ్రహణం కనిపించదు. ఇదిలా ఉంటేఅక్టోబరు 21-22న ఓరియోనిడ్స్ ఉల్కాపాతం కూడా కనువిందు చేస్తుంది. ఇది తిరిగి 2061లో మళ్లీ దర్శనమీయనుంది.