/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్ వాహనాదారుడు మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది.
Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?
దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.