Union Govt and CPI Maoist Party : మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

కేంద్ర ప్రభుత్వము, కమ్యూనిస్టు పార్టీ అఫ్ ఇండియా - మావోయిస్టు పార్టి మధ్యన కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. చర్చల కోసం జోక్యం చేసుకోవాలని పీస్ డైలాగ్ కమిటీ ఆదివారం నాడు ప్రధాని మోదీ, అమిత్ షాకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది.

New Update
Union Govt and CPI Maoist Party

Union Govt and CPI Maoist Party

Union Govt and CPI Maoist Party : గత కొంతకాలం నుంచి వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో ఎందరో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కో ఎన్ కౌంటర్ లో పదుల సంఖ్యలో నక్సల్స్ మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఓ లేఖను విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టు ప్రకటించింది. ఇకనైనా కాల్పుల విరమణ, శాంతి చర్చలు చేపడితే మంచిదని శాంతి చర్చల కమిటీ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వము, కమ్యూనిస్టు పార్టీ అఫ్ ఇండియా - మావోయిస్టు పార్టి మధ్యన కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం జోక్యం చేసుకోవాలని పీస్ డైలాగ్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్ర కుమార్ ఆదివారం నాడు ప్రధాని మోదీ, అమిత్ షాకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ  కమిటీకి చైర్మన్‌గా జస్టిస్ చంద్ర కుమార్ (మాజీ), ఉపాధ్యక్షుడిగా జంపన్న అలియాస్ నరసింహా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ప్రో. హర‌గోపాల్, కన్వీనర్‌గా దుర్గా ప్రసాద్, కో-కన్వీనర్లుగా జయ వింధ్యాల, డాక్టర్ తిరుపతయ్య, బాలకిషన్‌రావు, కందుల ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

లేఖ సారాశం....


‘ మేము పీస్ డైలాగ్ కమిటీ బాధ్యులము. ఈ కమిటీ పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. సిపిఐ - (మావోయిస్టు) పార్టీ, కేంద్ర ప్రభుత్వము మధ్యన కాల్పుల విరమణ - శాంతి చర్చల స్థాపన కోసం ఏర్పాటు అయింది పీస్ డైలాగ్ కమిటీ. ఇరు పక్షాల మధ్య శాంతియుత చర్చలను సులభతరం చేయడంకోసం, కాల్పుల విరమణను ప్రోత్సహించడం, హింసను అంతం చేయడానికి స్థిరమైన పరిష్కారాలను కనుక్కోవడం, ఇరు పక్షాలకు సూచనలు చేయటం కమిటీ ముఖ్య ఉద్దేశం. ఈ కమిటీలో సమాజంలోని వివిధ వర్గాల నుండి న్యాయ కోవిదులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు , మానవ హక్కుల నిపుణులు, జర్నలిస్టులు, ప్రజా నాయకులు భాగస్వాములుగా ఉన్నారు. 

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

మధ్య భారతదేశములో మావోయిస్టు పార్టీ  సాయుధులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధులకు మధ్య జరుగుతున్న హింసా విధానాలకు సామాన్య ప్రజలు, ఆదివాసీలు జీవించే హక్కును కోల్పోతున్నారు. నిత్యం ఆయా ప్రాంతాలలో నెత్తుటి మధ్యలోనే ప్రజలు జీవిస్తున్నారు అని పత్రికలలో వస్తున్న వార్తలు చూసి మేము కలవరపడుతున్నాం. ఇద్దరి హింసా విధానాల  ఫలితముగా మహిళలు, పిల్లలు, యువత భయబ్రాంతులకు గురవుతున్నారు. గ్రామాలు, గూడేలు వదిలి తరలివెళుతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాలు, రాజ్యంగములో చెప్పిన విధంగా సంక్షేమ రాజ్యము ఏర్పాటు చేయుటకు సరియైన, తగినటువంటి వాతావరణం రోజురోజుకూ సమాజంలో  క్షిణిస్తోందని ఆందోళన చెందుతున్నాము. 

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

మావోయిస్టు పార్టీ గెరిల్లాలు, ప్రభుత్వ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణను నివారించడానికి కాల్పుల విరమణ - శాంతి చర్చలు ఒక్కటే మార్గం అని ప్రజాస్వామిక వాదులముగా భావిస్తున్నాము. ఇరు పక్షాల మధ్య జరుగుతున్న ఈ సాయుధ సంఘర్షణ దేశంలోని అనేక ప్రాంతాలలో అశాంతి, మరియు ప్రాణనష్టానికి కారణమవుతోంది. మహిళలు మానభంగాలకు గురవుతున్నారు. చిన్నపిల్లలు తల్లి తండ్రులను కోల్పోతున్నారు,  గిరిజన సముదాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పెద్దఎత్తున మానవ హక్కులకు విఘూతము కలుగుతున్నది, ఈ హింసా విధానాలు  సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తూ, అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నది. 

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

ఇటీవల తాజా పరిణామాలు చూసి తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఐదు రాష్ట్రాల పరిధిలో ప్రజలు నిరంతరం రక్తపాతం మధ్య జీవిస్తున్నారనే వార్తలతో కలవరపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వైపులా హింసాత్మక చర్యలతో మహిళలు, పిల్లలు, యువత భయంతో జీవిస్తున్నారని చాలా మంది నిర్వాసితులు అవుతున్నారని నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయని అన్నారు.భారత రాజ్యాంగం ఊహించిన సంక్షేమ రాజ్య స్థాపన కోసం, దేశంలో పెరుగుతున్న హింస, దాని పర్యవసానాలు, పరిస్థితులను పరిష్కరించడానికి మీ తక్షణ జోక్యం అవసరమని మేము అభ్యర్థిస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు. శాంతి సంభాషణల కమిటీ దేశం యొక్క భవిష్యత్తుకు మీ తక్షణ జోక్యం అవసరమని మీరు పరిగణించాలని, ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండేందుకు, శాంతి చర్చల మార్గంలోకి రావడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లుగా తెలిపారు.

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు