/rtv/media/media_files/2025/01/08/C36mDZo8PRvjrmv6GEv2.jpg)
TG Court Jobs
హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని...వాటి ద్వారా హైడ్రా కూల్చివేతలకు పాల్పడడం సరికాదంది కోర్టు. కేవలం పత్రాలను చూసి నిర్మాణం హక్కులను ఎలా తేలుస్తారని అడిగింది. అసలు హైడ్రాకు హక్కులను నిర్ణయించే అధికారం ఎవరిచ్చారని కోర్టు మండిపడింది. నోటీసులు జారీ చేసి.. వివరణ ఇచ్చేందుకు తగిన గడువు ఇచ్చి.. చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని చెప్పినా..ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. ఇలా అయితే జీవో 99ను రద్దు చేసి హైడ్రాను మూసేయాల్సి వస్తుందని హైకోరట్ు హెచ్చరించింది.
Also Read : రంజాన్ బంపర్ ఆఫర్.. 24 గంటలు షాపులు తెరవచ్చు..!
సరిగ్గా పరిశీలించకుండానే..
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్‌ను కూల్చివేశారని హైకోర్టులో ఎ.ప్రవీణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. దీనికి హైడ్రా ఇనెస్పెక్టర్ రాజశేఖర్ హాజరయ్యారు. జస్టిస్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రాజశేఖర్, ఆయన తరుఫు న్యాయవాది..పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు. అంతకు ముందు పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని, తర్వాత ఆ అనుమతులను రద్దు చేస్తూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతే హైడ్రా చర్యలు చేపట్టిందని తెలిపారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే చట్టపరమైన ప్రక్రియ ద్వారా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
Also Read : తెగించిన కామాంధులు.. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై.. !
Also Read : ఇజ్రాయెల్ బస్సుల్లో పేలుళ్లు..ఉగ్రవాదుల పనేనా?
దీనిపై జస్టిస్ లక్ష్మణ్ అసహనం వ్యక్తం చేశారు. తాను 20కి పైగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశానని..అయినా పిటిషన్లు వస్తూనే ఉన్నాయని అన్నారు. 2023లో అనుమతులు మంజూరు చేస్తే 2025లో ఎలా రద్దు చేస్తారని, ఇన్నేళ్లు ఏం చేశారని నిలదీశారు. గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో చర్యలు చేపట్టామని ఇప్పుడు చెబుతున్నారు...కానీ అదే అసోసియేషన్ హైడ్రా కన్నా ముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. పార్కు ఆక్రమణ జరుగుతుంటే అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. వీళ్ళందరూ ఇప్పుడు కావాలనే హైడ్రాను వాడుకుంటున్నారని జడ్జి వ్యాఖ్యానించారు. తాను పిటిషనర్ ను సమర్థించడం లేదని..కానీ హైడ్రా అధికారులు చట్టప్రకారం ముందుకు వెళ్ళడం లేదని అన్నారు. ప్రస్తుతం పిటిషనర్‌కు చెందిన స్థలంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశిస్తూ.. విచారణను మార్చి 5కి వాయిదా వేశారు.
Also Read: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..