WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

వాట్సాప్‌ వీడియో కాల్‌కు ముందు వీడియో ఆపివేసే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అలాగే వాయిస్ కాల్‌ మ్యూట్ చేయడం వంటి రెండు కొత్త ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరో కొత్త ఫీచర్ వాట్సాప్ వీడియో కాల్‌లో ఎమోజీలు షేరింగ్ కూడా రానుంది.

New Update
whatsapp new features

whatsapp new features

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 3.5 బిలియన్ల యూజర్లు వాట్సాప్‌ను వాడుతున్నారు. వీడియో, ఆడియో కాల్స్, డేటా షేరింగ్ కోసం ఈ యాప్‌ను యూస్ చేస్తున్నారు. అయితే  ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ ఎప్పటికప్పుడూ వినియోగదారులకు కొత్త ఫీచర్లు అందిస్తోంది. తాజాగా మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువచ్చింది. 2025 మొదటి మూడు నెలల్లోనే వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను ప్రారంభించింది. తాజా అప్‌డేట్‌లలో ఒకటి వినియోగదారుల కోసం కాలింగ్ మరియు వీడియో కాలింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంపై ఫోకస్ పెట్టింది. 

Also read: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

ఈ రాబోయే ఫీచర్ల గురించి వివరాలను ప్రముఖ వెబ్‌సైట్ WABetainfo షేర్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ కోసం తాజా వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్లు పొందవచ్చు. వాట్సాప్ ప్రత్యేకంగా వాయిస్, వీడియో కాల్‌ల కోసం మూడు కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్లు బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌కమింగ్ వాయిస్ కాల్ నోటిఫికేషన్‌లను  మ్యూట్ చేసుకోవచ్చు. మైక్రోఫోన్‌ను మ్యూట్ చేస్తూ వాయిస్ కాల్‌లకు ఆన్సర్ ఇవ్వొచ్చు. వీడియో కాలింగ్‌ సర్వీస్‌ను పెంచడం కోసం కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చింది. వినియోగదారులు వీడియో కాల్‌కు లిఫ్ట్ చేసేముందువీడియోను హైడ్ చేయవచ్చు. గతంలో వాట్సాప్ యూజర్లు కాల్ ఆన్సర్ చేసిన తర్వాతనే కెమెరాను ఆపివేసే అవకాశం ఉండేది. ఈరెండు వాట్సాప్ కొత్త ఫీచర్లతో పాటు మరో అప్‌డేట్ కూడా త్వరతలో తీసుకురానుంది. ఆ ఫీచర్‌తో వాట్సాప్ వీడియో కాల్స్ సమయంలో ఎమోజిస్ షేర్ చేసుకోవచ్చు.

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

Advertisment
Advertisment
Advertisment