/rtv/media/media_files/2025/04/05/9hl6Sy9nrv2jNKRL0OYI.jpeg)
HCU land issue KCR Photograph: (HCU land issue KCR)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం హెచ్సీయూ భూవివాదంపై మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వ తొందరపాటు చర్యలతో సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు పోయిందని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం, అటవి భూముల కోసం హెచ్సీయూ విద్యార్థుల శాంతియుత పోరాటాన్ని కేసీఆర్ అభినందించారు. ప్రజల ఆకాంక్షలు ఉద్యమపార్టీ బీఆర్ఎస్‌కే తెలుసని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వేదికగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు కీలక సూచనలు చేశారు.
Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.
— BRS Party (@BRSparty) April 5, 2025
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన శనివారం ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో… pic.twitter.com/tXw9Sw62wi
Also read: Sri Rama Navami: కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య సన్నిదికి సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పాలకు, నీళ్లకు తేడా తెలిసిందని చెప్పుకొచ్చారు. ఏం కోల్పోయారో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని ఆయన చెప్పారు. సాగు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆయర ఆరోపించారు. BRS రజతోత్సవ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలివస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. త్వరలో జిల్లా పార్టీ ఆఫీసుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆయన అన్నారు.