/rtv/media/media_files/2025/04/05/IZlt50jNjbovaEaBGvoY.jpg)
Rain Alert For Telangana
Rain alert : ఎండలతో సతమవుతున్న తెలంగాణ వాసులకు వాతవరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది.
Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్!
ఎండల నుంచి ఉపశమనం పొందడానికి భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఆరు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, ఏప్రిల్ 7 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 7 నుంచి స్కూల్ పిల్లలకు ఫైనల్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ సమయంలో ఈ వార్త కొంత వరకు ఉపశమనం కలిగించేదే అని చెప్పాలి. అయితే పాఠశాలకు వెళ్లే సమయంలో పడితే మాత్రం ఇబ్బందులు తప్పవు.
Also Read: America Trump:ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!
ఈనెల 7, 8 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుపాన్ వచ్చే అవకాశం ఉందని, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే 8, 9 తేదీల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తుపాన్ వచ్చే ప్రమాదం ఉందని, ఆయా తేదీల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబాబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. అలాగే ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కావున, ఆయా జిల్లాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఏప్రిల్ 7 నుంచి 12 వరకూ జాగ్రత్తగా ఉండాలి.