/rtv/media/media_files/2025/01/27/xpMRcojhoBXS5Nyz2tMh.png)
Photograph: (Supreme Court)
Supreme Court: సుప్రీం కోర్టుకు ఓ సవాలు ఎదురైంది. 20ఏళ్ల కిందటి కేసు సుప్రీం కోర్టులోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. జనవరి 28న కోర్టులో కేసు విచారణ కొనసాగింది. 23ఏళ్ల యువకుడు తన తండ్రి ఎవరో తెలుసుకోవడం కోసం DNA టెస్ట్ చేయాలని సుప్రీ కోర్టును ఆశ్రయించాడు. తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. వాటికి అతని అసలైన తండ్రి నుంచి మెయిటెనెన్స్ కావాలని కుమారుడు డిమాండ్ చేస్తున్నాడు. అతని తల్లికి అక్రమసంబంధం ఉందని.. తాను ఎవరికి పుట్టానో తెలుసుకోవడానికి కోర్టును కోరాడు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..
Also Read: అలా చేశావేంటమ్మా.. చనిపోయాక ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు బాలిక సూసైడ్..
తండ్రి ఎవరో తెలుసుకోడానికి..
కేరళలో 23 ఏళ్ల మహిళ 1989లో వివాహం చేసుకుంది. 1991లో ఓ కుమార్తె, 2001లో కుమారుడు జన్మించాడు. ఆ మహిళ 2003లో తన భర్త నుండి విడిపోయింది. వారికి 2006లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. తర్వాత మహిళ తన కొడుకు బర్త్ సర్టిఫికేట్‌లో తండ్రి పేరు మార్చాలని కొచ్చిన్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆశ్రయించింది. తనకు వివాహేతర సంబంధం ఉందని, ఆ సంబంధం వల్లే బిడ్డ పుట్టిందని సదరు మహిళ అధికారులకు చెప్పింది. కోర్టు ఉత్తర్వులు లేకుండా బర్త్ రికార్డ్‌లో వివరాలు మార్చలేమని అధికారులు చెప్పారు. దీంతో ఆ మహిళ, కుమారుడు కోర్టును ఆశ్రయించారు. 2007లో బయోలాజికల్ తండ్రి ఎవరో తెలుసుకోవడానికి DNA పరీక్ష చేయించుకోవాలని కోర్టు మహిళతో వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తిని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సదరు వ్యక్తి 2008లో హైకోర్టులో సవాలు చేశాడు.
Also Read: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు
వివాహ సమయంలో లేదా విడాకులు తీసుకున్న 280 రోజులలోపు పుట్టిన బిడ్డ చట్టబద్ధమైన సంతానంగా కోర్టు పేర్కొంది. భార్యాభర్తల మధ్య ప్రవేశం లేదని పార్టీలు నిరూపిస్తేనే పితృత్వ పరీక్షకు ఆదేశించవచ్చని హైకోర్టు పేర్కొంది. ఆ తర్వాత వచ్చిన కోర్టుతీర్పులు తల్లీకొడుకులకు వ్యతిరేకంగా ఉన్నాయి. బిడ్డ పుట్టినప్పుడు తల్లి, ఆమె భర్త మధ్య చెల్లుబాటు అయ్యే వివాహం ఉన్నందున DNA టెస్ట్ అవసరం లేదని దిగువ కోర్టు చెప్పింది. 2015లో బిడ్డకు 14 ఏళ్లు.. తల్లికి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని మెయింటెనెన్స్ పిటిషన్ ఫ్యామిలీ కోర్టులో వేశాడు. తాను అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, సర్జరీలు చేయించుకున్నానని వారికి ఆర్థిక స్థోమత లేదని కుమారుడు కోర్టుకు చెప్పారు. అతను తన వైద్య, విద్యా ఖర్చుల కోసం ఎలాంటి భరణం పొందడం లేదని చెప్పాడు. మెయింటెనెన్స్ పిటిషన్‌ను కోర్టు పునరుద్ధరించింది. దీన్ని అతని బయోలాజికల్ తండ్రి హైకోర్టులో సవాలు చేశారు. 2018లో హైకోర్టు కుమారుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అసలైన తండ్రి నుంచి పిల్లలు మెయింటెనెన్స్ పొందే హక్కు ఉందని చెప్పింది. సదరు వ్యక్తి ఈ ఉత్తర్వులను మళ్లీ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
Also Read: OTT Movies: మూవీ లవర్స్ కి పండగ.. ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు.. లిస్ట్ ఇదే!
సుప్రీం కోర్టులో ఈ కోర్టు కేసు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. జనవరి 28న వాదోపవాదనలు విన్న ధర్మాసనం కేసులో ఓ ఆదేశం ఇచ్చింది. అసలైన తండ్రి ఎవరో తెలుసుకునే హక్కు కొడుకుకి ఉంది. అలాగే వివాహేతర సంబంధం పెట్టకున్న వ్యక్తి గోప్యత హక్కు కారణంగా DNA టెస్ట్ చేయించుకోవడం లేదని సుప్రీం కోర్టు చెప్పింది. కోర్టు తీర్పు వాయిదా వేసింది.
Also Read: Thandel Trailer: అక్కినేని ఫ్యాన్స్ కి పండగే .. తండేల్ ట్రైలర్ గూస్ బంప్స్