/rtv/media/media_files/2025/02/23/hair1-688164.jpeg)
hair
తలకు నూనె అప్లై చేసేటప్పుడు కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల జుట్టు రాలిపోతుంది. హెయిర్ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే జుట్టుకు నూనె అప్లై చేసి చేయకూడని ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ఆయిల్ రాసి ఎక్కువ సమయం ఉంచవద్దు..
కొందరు జుట్టుకు ఆయిల్ రాసి రాతంత్రా అలాగే వదిలేస్తారు. ఇలా జుట్టుకు అప్లై చేసి రాత్రంతా ఉండటం వల్ల దుమ్మ, దూళి అంటుకుంటాయి. అలాగే జుట్టుని గట్టిగా కట్టేయడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. ఆయిల్ అప్లై చేసి ఎక్కువగా ఉండవద్దు. తలస్నానం చేసే ముందు మాత్రమే తలకు ఆయిల్ అప్లై చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం అవుతుంది. కొందరు జుట్టు డ్రైగా ఉంటుంది. అలాంటి వారు జుట్టుకు ఆయిల్ ఎక్కువగా రాయాలి. ఆయిల్ హెయిర్ ఉన్నవారు తక్కువగా జట్టుకు ఆయిల్ అప్లై చేయాలి.
ఇది కూడా చూడండి: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!
ఆయిల్‌ను పెట్టుకుని నిద్రపోతే దిండుకి కూడా తగులుతుంది. దీంతో మీ ముఖానికి మొటిమలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే దురద, స్కాల్ప్, ఇరిటేషన్ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి చుండ్రు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు తలకు ఆయిల్ అప్లై చేయడం వల్ల చుండ్రు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తలకు ఎక్కువగా ఆయిల్ అప్లై చేయవద్దు. కొందరు తెలియక ఆయిల్ అప్లై చేశాక జుట్టును టైట్‌గా కట్టేస్తారు. దీనివల్ల జుట్టు కుదుళ్లు వీక్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి