Cancer
Cancer: చాలా మంది నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలను ఇష్టపడతారు. వాళ్ళు హోటళ్ళు, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు అలాంటి ఆహారాలను ఆర్డర్ చేసి తింటారు. ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో కూడా ఇలాంటి ఆహారాలను తయారు చేసి తింటారు. అయితే ఇలా చేయొద్దని, జాగ్రత్తగా ఉండటం అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల వేయించిన ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని వేడి చేయడం వల్ల హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
క్యాన్సర్ వచ్చే ప్రమాదం:
అందుకే నిపుణులు కొన్నింటిని ఎక్కువగా వేడి చేయవద్దని, ముఖ్యంగా అవి నల్లగా మారే వరకు వేయించవద్దని హెచ్చరిస్తున్నారు. ఓ అధ్యయనంలో అధిక మొత్తంలో వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. మాంసాన్ని ఎక్కువసేపు వేయించడం వల్ల క్యాన్సర్ కారక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు, హెటెరోసైక్లిక్ అమైన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనే రసాయనాలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. ఈ రసాయనాలు DNA ను దెబ్బతీస్తాయి. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఇది కూడా చదవండి: అవునా.. ఫిల్టర్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుందా.. నిజమెంత?
ప్రాసెస్ చేసిన మాంసాలను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేయించడం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెన్‌లు అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అందుకే మాంసాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి చిప్స్ అంటే ఇష్టం. బంగాళాదుంపలను సైడ్ డిష్‌గా, స్నాక్స్ గా తీసుకుంటారు. అయితే బంగాళదుంపలను నూనెలో ఎక్కువసేపు వేయించడం వల్ల అక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల క్యాన్సర్ రావచ్చు. అందుకే నిపుణులు వాటిని చిప్స్ కు బదులుగా ఉడికించి తినమని సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉందా..?
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)