Afternoon Nap
Afternoon Nap: భోజనం చేసిన తర్వాత కళ్లు బరువుగా మారతాయి. కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బాగా నిద్రవస్తుంటుంది. అయితే దీనికి కారణం ఎక్కువగా తినడమే అని అనుకుంటారు. కానీ నిపుణులు మన బాడీలోని సిర్కాడియన్ రిథమ్ అనేది మధ్యాహ్నం కొంచెం నీరసాన్ని సూచిస్తుందని అంటున్నారు. రాత్రి నిద్ర అసంపూర్ణంగా ఉంటే లేదా ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. అందుకే మధ్యాహ్నం కాసేపు అయినా పవర్ నాప్ వేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా పవర్ నాప్ వేయడం వల్ల శరీరం రీఛార్జ్ అవుతుందని చెబుతున్నారు. కానీ మధ్యాహ్నం సమయంలో ఎక్కువ సేపు నిద్రపోవడం మంచిది కాదు.
మధ్యాహ్నం నిద్ర వల్ల ప్రయోజనాలు:
పరిశోధన ప్రకారం 20-30 నిమిషాల నిద్ర మెదడును ఉత్తేజ పరుస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, దృష్టి, ఆలోచనను మెరుగుపరుస్తుంది. కొన్ని అధ్యయనాలు కూడా పవర్ నాప్‌లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నాయి. కాసేపు నిద్రించడం వల్ల ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. మానసిక స్థితి కూడా బాగుంటుంది. శక్తి పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
మధ్యాహ్నం నిద్ర వల్ల నష్టాలు:
మధ్యాహ్నం నిద్రపోవడం ప్రయోజనకరమే అయినా హానికరం కూడా. 30 నిమిషాల కంటే ఎక్కువసేపు పడుకుంటే గుండె దడ, నీరసంగా అనిపిస్తుంది. ఎక్కువ గందరగోళానికి గురవుతారు. అరగంట కన్నా ఎక్కువసేపు నిద్రపోతే మెదడు గాఢ నిద్రలోకి జారుకుంటుంది. మేల్కొన్న తర్వాత ఒక గంట వరకు గజిబిజిగా అనిపించవచ్చు. అలాగే పగటిపూట చాలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల రాత్రి నిద్రపోవడం కష్టమవుతుంది.
సైన్స్ చెబుతున్నదేంటి?
26 నిమిషాల నిద్రతో 54శాతం పనితీరు మెరుగుపడిందని గుర్తించారు. అథ్లెట్లు తరచుగా కండరాలను పునరుద్ధరించడానికి, శక్తిని మెరుగుపరచడానికి పవర్ నాప్ వేస్తారు. వైద్యులు, పైలట్లు వంటి అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలలో ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండటానికి పవర్ నాప్ వేస్తారు. 10 నుండి 20 నిమిషాలు నిద్రపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మధుమేహం ఉంటే మామిడి పండ్లు తినవచ్చా?
( afternoon-sleep | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)