🔴Live Breakings: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news | andhra-pradesh-news | national news in Telugu | international news in telugu | telugu crime news | telugu-cinema-news | telugu-film-news | andhra-pradesh-politics | telangana-politics | national-politics | telugu international politics | business news telugu | latest technology news in telugu | telugu-cricket-news | telugu-sports-news

  • Apr 05, 2025 11:15 IST

    నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు!

    ఫార్మసిస్ట్ విద్యార్థిని నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  నాగాంజలి మృతికి కారణమైన దీపక్‌ను...కఠినంగా శిక్షించాలని బంధువులు,గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని నిరసనకు దిగారు.

    pharmacist Naganjali
    pharmacist Naganjali

     



  • Apr 05, 2025 11:15 IST

    అలేఖ్య చిట్టి సంచలన వీడియో రిలీజ్..

    గత రెండు రోజులుగా అలేఖ్య చిట్టి పికెల్స్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ఈ వివాదంపై అలేఖ్య క్షమాపణలు తెలిపింది. ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. ‘నేను తప్పు చేశాను. ఇప్పటి వరకు ఎవర్నైతే తిట్టానో వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొంది.

    Alekhya Chitti say sorry to customers after Alekhya Chitti Pickles Issue
    Alekhya Chitti say sorry to customers after Alekhya Chitti Pickles Issue Photograph: (Alekhya Chitti say sorry to customers after Alekhya Chitti Pickles Issue )

     



  • Apr 05, 2025 11:14 IST

    మరో నిర్భయ.. నోట్లో గుడ్డలు కుక్కి .. కన్న కొడుకుల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్!

    కర్ణాటకలో మరో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. దావణగెరె జిల్లాలో కదులుతున్న బస్సులో ఓ మహిళపై ముగ్గురు కామాంధులు ఇద్దరు కుమారుల ముందే సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

    Karnataka-gang-rape
    Karnataka-gang-rape

     



  • Apr 05, 2025 09:16 IST

    సికింద్రాబాద్‌ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం!

    సికింద్రాబాద్​లోని బోయిన్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో మహేశ్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకేసారి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



  • Apr 05, 2025 09:16 IST

    పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!

    అలోవేరా జ్యూస్ అనుకొని  ఓ14 ఏళ్ల బాలిక పురుగుల మందు తాగి మరణించింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. దీపాంజలినగర్ కు చెందిన నిధి కృష్ణ అనే బాలికకు రోజూ అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. అయితే ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్‌ తీసుకొని తాగేసింది.

    nidhi-krishna
    nidhi-krishna

     



  • Apr 05, 2025 09:15 IST

    ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌...వారంలో మెగా డీఎస్సీ!



  • Apr 05, 2025 07:44 IST

    ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

    తన ఆరోగ్యం బాగోలేదని స్నేహితుడిని నమ్మి తన కూతురి బాధ్యతలు అప్పగిస్తే చిన్నారిపై లైంగిక దాడి చేశాడో ప్రబుద్ధుడు. కోర్టు అతడికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మరో ఘటనలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి 25ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

    court verdict 2
    court verdict 2

     



  • Apr 05, 2025 07:44 IST

    మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?

    నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ సారి రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతగా నమోదైంది. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు తలెత్తడంతో ప్రజల పరుగులు తీశారు. మరోవైపు ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కూడా ఇవి తాకినట్లు సమాచారం.



  • Apr 05, 2025 07:44 IST

    జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

    తమిళ నటుడు&బిగ్‌బాస్‌ ఫేమ్‌ దర్శన్‌ అరెస్ట్ అయ్యాడు. కారు పార్కింగ్‌ వ్యవహారంలో ఏర్పడిన వివాదంలో హైకోర్టు న్యాయమూర్తి కుమారుడిపై దాడిచేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే న్యాయమూర్తి ఫ్యామిలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



  • Apr 05, 2025 07:43 IST

    హైదరాబాద్లో 24 గంటల పాటు వైన్ షాపులు బంద్!

    మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. 2025 ఏప్రిల్ 06వ తేదీ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా  వైన్ షాపులు బంద్ చేయాలని రాచకోండ పోలీస్ కమిషనర్ రేట్ ఉత్తర్వులు జారీ చేసింది.

    wines closed
    wines closed

     



  • Apr 05, 2025 07:43 IST

    ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే..

    ఏపీలో మరో మూడు రోజులు విభిన్న వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల శని, ఆదివారం పిడుగులతో కూరిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.



  • Apr 05, 2025 07:42 IST

    పెద్దన్న నిర్ణయానికి ..ఏపీలో ఆక్వారంగం కుదేలు!

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీలోని ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రొయ్యలపై దిగుమతి సుంకాన్ని అమెరికా పెంచబోతోందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఏపీలో రొయ్యల కొనుగోళ్లు నిలిచిపోయాయి.

    aqua
    aqua

     



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: సెన్సెక్స్ భారీగా పతనం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 07, 2025 21:45 IST

    Virat kohli: టీ20ల్లో ఏకైక మొనగాడు.. కింగ్ ఖాతాలో మరో రికార్డ్!

    భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. టీ20ల్లో13 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 386 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీకంటే ముందు నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు.

    v kohli
    v kohli Photograph: (v kohli)

     



  • Apr 07, 2025 21:44 IST

    TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు

    టారీఫ్‌ల విధింపులో ట్రంప్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా 180 దేశాలపై ఏప్రిల్ 2 నుంచి దిగుమతి సుంకాలు విధించింది. అమెరికన్స్‌తోపాటు, విదేశాల్లో ట్రంప్ చర్యపై వ్యతిరేకత రావడంతో 90రోజులు కొన్నిదేశాలపై సుంకాలు నిలిపివేసే అవకాశం ఉంది.

    Trump
    Trump

     



  • Apr 07, 2025 15:06 IST

    Lady Aghori: ప్రభాస్ ఇంటి పక్క ఆ విల్లాపై అఘోరీ క్లారిటీ.. అది మాత్రమే నిజం

    శ్రీవర్షిణీ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను అఘోరీ ఖండించింది. జూబ్లీహిల్స్‌లో ప్రభాస్ ఇంటి పక్కనున్న విల్లా తనది కాదని ఆమె చెప్పింది. కార్లో లక్షల క్యాష్, వందల కోట్ల ఆస్తులు కూడా లేవని అఘోరీ Rtvతో చెప్పింది. కేవలం పూజలు చేసేది మాత్రమే నిజమని అఘోరి చెప్పింది.

    lady aghori villa
    lady aghori villa

     



  • Apr 07, 2025 15:02 IST

    Ponting: ద్రవిడ్‌లా వారిద్దరికీ చెప్పలేను.. రో-కోపై పాంటింగ్‌ షాకింగ్ కామెంట్స్!

    భారత క్రికెటర్లతో సన్నిహిత్యంపై రికీ పాంటింగ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ద్రవిడ్‌ కెరీర్ స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు తాను అండగా నిలిచానన్నాడు. ఇప్పుడు టెస్టుల్లో ఇబ్బంది పడుతున్న 'రో-కో'కు తానేమి చెప్పలేనని, వారిద్దరూ బెస్ట్ క్రికెటర్లే అన్నాడు. 

    ponting
    ponting Photograph: (ponting)

     



  • Apr 07, 2025 09:51 IST

    సెన్సెక్స్ భారీగా పతనం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ సునకాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. ఒక్కసారిగా 3900 పాయింట్లకు సెన్సెక్స్ పడిపోయింది. 1140 పాయింట్లకు నిఫ్టీ పడిపోయింది. 5 శాతం దేశీయ స్టార్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.

    Sensex Today: కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ పతనం.. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు  



  • Apr 07, 2025 07:23 IST

    ఫిక్స్.. ఎన్టీఆర్తో సుకుమార్.. మరి దేవర 2 ఎప్పుడు?

    ఎన్టీఆర్, సుకుమార్ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్‌ గా మారింది. సుకుమార్ భార్య తబిత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తారక్ కి ప్రేమతో అని ఆమె క్యాప్షన్ ఇవ్వగా.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్" అనే ఎన్టీఆర్ రిపోస్ట్ చేశారు.

    ntr-sukumar
    ntr-sukumar

     



  • Apr 07, 2025 07:22 IST

    ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ

    తనకు మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరగొట్టిన సెహ్వాగ్‌, సచిన్‌, గంగూలీ, యువరాజ్‌‌లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నాని ఓ పాడ్‌కాస్ట్‌లో ధోని అన్నాడు. కష్ట సమయాల్లో వీరి ప్రదర్శన మనమంతా చూశాం. అప్పుడు వీరు ఆడుతుంటే అందంగా అనిపిస్తుండేదని చెప్పుకొచ్చాడు.

    Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1)
    Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1) Photograph: (Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1))

     



  • Apr 07, 2025 07:22 IST

    అతడుంటే మ్యాచ్ మలుపు తిప్పేవాడు .. ఆసుపత్రి పాలైన సన్‌రైజర్స్ బౌలర్!

    ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. వీపరితమైన జ్వరం కారణంగా హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడలేదు.

    Harshal Patel
    Harshal Patel

     



  • Apr 07, 2025 07:21 IST

    పాపం.. భార్య వేధింపులకు మరో భర్త బలి

    ఒడిశాకు చెందిన ఓ భర్త భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలిపాడు. భార్య వేధింపులు భరించలేక కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    Odisha crime
    Odisha crime Photograph: (Odisha crime)

     



Advertisment
Advertisment
Advertisment