🔴Live News: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

🔴Live News Updates:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలను ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడండి. 

  • Mar 02, 2025 13:37 IST

    సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్

    సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినందుకు సస్పెన్షన్ వేటు విధించింది.

    BREAKING NEWS
    breaking news

     



  • Mar 02, 2025 11:25 IST

    మహిళా న్యాయవాదిపై యాసిడ్ దాడి.. కోర్టులోకి వెళ్తుండగా దారుణం!

    ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మొరాదాబాద్‌ కోర్టు ఆవరణలో మహిళా న్యాయవాదిపై ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. ఆమె చీర పలుచోట్ల కాలిపోగా శరీరంపై గాయాలయ్యాయి. నిందితులు సచిన్‌ కుమార్, నితిన్‌ కుమార్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

    acid attack
    acid attack Photograph: (acid attack)

     



  • Mar 02, 2025 11:10 IST

    అయ్యో పాపం.. క్రేన్‌ ఢీకొని తండ్రీ కొడుకు దుర్మరణం

    హనుమకొండ జిల్లాలో క్రేన్‌ వెనుక నుంచి ఢీకొట్టడంతో సైకిల్‌పై వెళ్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. మృతులు ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన తంగెడ రాజేశ్వరావు, సాగర్‌రావుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

    Death Hanumakonda
    Death Hanumakonda

     



  • Mar 02, 2025 09:57 IST

    నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బస్సు, కంటైనర్, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    accident
    accident

     



  • Mar 02, 2025 09:56 IST

    రఘురామ కృష్ణంరాజు కేసులో బిగ్ ట్విస్ట్... సునీల్‌నాయక్‌కు నోటీసులు !

    టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.  ఐపీఎస్‌ అధికారి సునీల్‌నాయక్‌ను విచారణకు పిలుస్తూ పోలీసులు  నోటీసులు పంపారు.  ఫ్యాక్స్, వాట్సప్‌ ద్వారా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయనకు నోటీసులు పంపారు.  

    raghu rama case



  • Mar 02, 2025 09:55 IST

    SLBC టన్నల్‌ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

    తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SLBC టన్నల్‌లో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి ఆదివారం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి SLBC ప్రాజెక్ట్ ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా దొమలపెంటకు చేరుకోనున్నారు.

    cm revanth reddy123
    cm revanth reddy123 Photograph: (cm revanth reddy123)

     



  • Mar 02, 2025 09:00 IST

    కేటీఆర్‌కు మరో బిగ్ షాక్.. మరోసారి విచారణ!

    కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఫార్ములా ఈ రేసు కేసు కీలక దశకు చేరుకుంది.‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను మరోసారి విచారిం చేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డిని ప్రశ్నించనున్నారు. 

    KTR
    KTR

     



  • Mar 02, 2025 08:57 IST

    పాస్‌పోర్ట్ రూల్స్ మారినయ్.. కొత్త నిబంధనలు ఇవే!

    పాస్‌పోర్ట్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు తీసుకువచ్చింది.  2023 అక్టోబర్ 1 తరువాత పుట్టిన వారందరూ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

    indian passport



  • Mar 02, 2025 08:56 IST

    ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 37 మంది మృ‌తి

    ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొని 37 మంది ప్రయాణికులు మరణించారు. మరో 39 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణ అమెరికా దేశం బొలివియాలోని పొటోసిలో చోటుచేసుకుంది. కార్నివాల్ వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది.

    road accident in Bolivia
    road accident in Bolivia Photograph: (road accident in Bolivia)

     



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్..పెద్ద కంపెనీలన్నీ ఢమాల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు అన్ని దేశాల మీద వరుస బాంబ్ లు వేశాయి. దాంతో పాటూ తన సొంత దేశాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. టారీఫ్ ల దెబ్బకు వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ మొదలైంది.

New Update
usa

Blood Bath

ట్రంప్ టారీఫ్ ల మోతకు ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. నిన్న దాదాపు అన్ని దేశాల మీదనా ట్రంప్ కొత్త టారీఫ్ లను విధించారు. దీని దెబ్బకు దాదాపు అన్ని దేశాల్లో షేర్ మార్కెట్ షేక్ అయింది.   ఈరోజు భారత స్టాక్ మార్కెట్ కూడా దడదడలాడింది. ఘోరంగా షేర్లు పతనం అయ్యాయి. బంగారం ధర మరింత పెరిగింది. ఒక్క ఫార్మా తన్ని మిగతా అన్ని రంగాల షేర్లూ అతలాకుతలం అయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల పరిస్థితీ అలానే ఉంది. ఇప్పుడు అమెరికా వాల్ స్ట్రీట్ వంతు.

బ్లడ్ బాత్..

ఈరోజు మొదలవ్వడమే అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని షేర్లూ ఎర్ర రంగు పులుముకున్నాయి. ప్రతీకార సుంకాల మూలంగా వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వినట్లు అవ్వడమే కాకుండా.. అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఇది అమెరికా మార్కెట్ ను దెబ్బ తీస్తోంది. దీని కారణంగా ప్రధాన సూచీలన్నీ భారీగా పతనం అయ్యాయి. ఉదయం 10 గంటలకు డౌజోన్స్‌ 1500 పాయింట్లకు పైగా నష్టంతో 40,665 వద్ద ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ దాదాపు 5 శాతం మేర క్షీణించగా.. ఎస్‌అండ్‌పీ 500 4 శాతం కుంగింది. అమెరికాలో పెద్ద షేర్లు అని చెప్పుకునే నైకీ 12 శాతం, యాపిల్ 9 శాతం తో నష్టాల్లో నడుస్తున్నాయి. ఐఫోన్లకు ప్రధన సప్లయర్ చైనా..ఆ దేశానికి 54 శాతం సుంకాలు విధించడంతో ఐఫోన్ల సప్లయ్ కు ఆటంక ఏర్పడుతుందనే ఆందోళన మొదలైంది. 2020 తర్వాత యాపిల్‌ స్టాక్‌ ఈ స్థాయిలోపతనం కావడం ఇదే తొలిసారి. వీటిో పాటూ టెస్లా, అమెజాన్, మెటా లాంటి మిగతా ప్రధాన షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. 

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | stock-market 

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు