తెలంగాణ BIG BREAKING: బీఆర్ఎస్ నేత దారుణ హత్య సంగారెడ్డి జిల్లాలో రాజకీయ హత్య సంచలనంగా మారింది. కల్హేర్ మండలం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ నేత హరిసింగ్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. By Nikhil 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ప్రాజెక్టులో HCU భూమలు లేవని తెలిపింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకుందని పేర్కొంది. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad : బిగ్ షాక్.. ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంచేశారు బాబోయ్! వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై టోల్ ఛార్జీలను ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ పెంచింది. కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.పెరిగిన ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి. By Krishna 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Toll Gate Charges : హైదరాబాద్-విజయవాడ హైవే.. భారీగా తగ్గిన టోల్ ఛార్జీలు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి గుండా ప్రయాణించే వాహనాదారులకు ఎన్హెచ్ఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 2026మార్చి 31వరకు అమలులో కొత్త రేట్లు అమల్లో ఉండనున్నాయి. By Krishna 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Betting App: బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశం బెట్టింప్ యాప్ ప్రమోషన్లపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఐజీ ఎం. రమేష్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 90 రోజుల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీజేపీ జితేంధర్ సిట్ సభ్యులను ఆదేశించారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ UP Crime: అలహాబాద్ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య! తెలంగాణకు చెందిన ఐఐఐటీ మొదటి సంవత్సరం విద్యార్థి రాహుల్ అలహాబాద్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.పరీక్షలో విఫలం చెందడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే! గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక టాపర్ గా నిలిచారు. మొత్తం 900 మార్కులకు గానూ ఆమె 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్ కు ప్రిపేర్ అయింది. By Krishna 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఎంతకు తెగించార్రా.. గుడికి వచ్చిన వివాహితపై మాటువేసి గ్యాంగ్‌రేప్! నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కోండ మండలంలో దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలస్తోంది. నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన 8 మంది యువకులుగా పోలీసులు గుర్తించారు. వీళ్లలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ chicken prices : రంజాన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు! రంజాన్ పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల డిమాండ్ ను బట్టి ఇంతకంటే ఎక్కువ ధరకూ అమ్ముతున్నారు By Krishna 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn