మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మెట్రో రెండో దశ ప్రాజెక్టు సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. మెట్రో ఫేజ్-2కు కేంద్రం నుంచి ఇప్పటివరకు అనుమతులు రాకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని నిలదీసి ప్రశ్నించే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి దాదాపు 71 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.
కేటీఆర్ డైరెక్షన్‌లోనే కిషన్ రెడ్డి
మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరును తప్పుబడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్షన్‌లోనే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నాయని సీఎం ఆరోపించారు. మెట్రో విస్తరణ జరగాల్సిన నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారని, అందుకే కావాలనే ఈ ప్రాజెక్టును తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు.
కాగా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు మొత్తం రూ. 40 వేల కోట్లు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరిస్తూ ఆయన కొన్ని కీలక గణాంకాలను బయటపెట్టారు. రూ. 13 వేల 400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీతో, 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకునేలా ఒప్పించామన్నారు. ఈ లోన్ బదిలీ కోసం డాక్యుమెంట్ ఫీజు కింద రూ. 48 కోట్లు, ఈక్విటీ కింద రూ. 1,400 కోట్లు కూడా ఇప్పటికే చెల్లించామని చెప్పుకొచ్చారు. సరిగ్గా లోన్ చేతికి వచ్చే సమయంలో కిషన్ రెడ్డి రంగంలోకి దిగి అడ్డుపడుతున్నారని సీఎం ఆరోపించారు.
ఇంతవరకు అంతా సిద్ధం చేశాక IRFC లోన్ ఎందుకు ఇవ్వట్లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లోన్ శాంక్షన్ కాకుండా ఆయనే అడ్డుకుంటున్నారా లేదా? దీనిపై బాధ్యతగా మాట్లాడుతారా? అని సీఎం ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌ను కేంద్రం పట్టించుకోవట్లేదు...KTR సంచలన కామెంట్స్!
మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మెట్రో రెండో దశ ప్రాజెక్టు సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు.
KTR