/rtv/media/media_files/2026/06/16/fotojet-6-2026-06-16-13-48-33.jpg)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్నారి బాలుడి చివరి కోరికను తీర్చడం కోసమే ఆయన ఈ పర్యటనకు వెళ్లనున్నారు. ఎలాగైనా తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్‌ను చూడాలన్నది ఆ బాలుడి ఆశ. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆ బాలుడిని పరామర్శించనున్నారు. నిజానికి ఈ పర్యటన కొన్ని రోజుల క్రితమే జరగాల్సింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే హన్మకొండకు వచ్చి ఆ బాలుడిని పరామర్శించాలని పవన్ అనుకున్నారు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆ సమయంలో తెలంగాణ పోలీసులు ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో రేపు ఆ బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు.
రేపు హన్మకొండకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ పవన్ కళ్యాణ్‌ను చూడాలని బాలుడి చివరి కోరిక
దీంతో రేపు బాలుడిని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్ pic.twitter.com/oKywmcij7s
Follow Us