Telangana Rains : హైదరాబాద్ అలర్ట్ :  పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి.

New Update
rains

rains

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారనుంది. ఆకాశంలో ద్రోణి లేదా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో.. జూన్ 18 నుంచి దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల పరిసర జిల్లాల్లో చాలా ఎక్కువ మొత్తంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పిడుగులు పడే అవకాశం

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. దీని ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసేవారు, ప్రయాణికులు చెట్లు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. అయితే, వర్షాలు పడే లోపు కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా గట్టిగానే ఉండవచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు