CM Revanth: త్వరలో 40 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. బుధవారం హుజరాబాద్లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. బుధవారం హుజరాబాద్లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం రెల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేపింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తులు నల్లని సంచుల్లో బాంబు ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును వీధి కుక్క కొరకడంతో భారీ శబ్దం వచ్చింది.
శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తెలంగాణ నుంచి పది ప్రత్యేక రైళ్లను శబరిమలకు వెళ్లే భక్తులకోసం నడపనున్నట్లు రైల్వే సంస్థ తెలిపింది.
అప్పుల పాలైన ఓ తమ్ముడు వాటిని చెల్లించలేక మానసికంగా సరిగా లేని అన్న ప్రాణాల్నే పణంగా పెట్టాడో ప్రభుద్దుడు. ఇందుకోసం అన్నపేరిట రూ.4.14కోట్లకు బీమా పాలసీలు చేయించి మరీ హత్య చేశాడు. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (HILT) పాలసీ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ORR లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9వేల 292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చుతామని, దీని వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఎన్నికల ఖర్చుకోసం ప్రభుత్వం ఇంతవరకు నిధులు కేటాయించకపోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.పైసా ఇవ్వకుండా ఎన్నికలు ఎలా నిర్వహించడమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
టెక్నికల్‌గా ఎంతో పట్టున్న ఐ బొమ్మ రవికి పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రవి తెలివి తేటలు మెచ్చి సైబర్ క్రైమ్‌లో ఉద్యోగం ఆఫర్ చేశారని చర్చ సాగుతోంది. అయితే పోలీసుల ఆఫర్‌ని రవి తిరస్కరించాడని సమాచారం.
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.