/rtv/media/media_files/2026/01/31/train-2026-01-31-11-18-42.jpg)
హైదరాబాద్(hyderabad) శివార్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోడుప్పల్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రైలు కిందపడి ఆత్మహత్య(family-suicide) చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని చర్లపల్లి, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న ఎంఎంటీఎస్ డౌన్ లైన్ పట్టాలపై ఈ ఘటన జరిగింది. మృతులలో భార్యాభర్తలతో పాటు ఒక చిన్నారి కూడా ఉండటం స్థానికులను కలచివేసింది.
Also Read : కోఠిలో భారీ దోపిడీ.. రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు!
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి
ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందిని సురేంద్రరెడ్డి, విజయ, చేతన్‌రెడ్డిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబం మొత్తం ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఇతర కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో బోడుప్పల్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read : మేడారంలో అమ్మవార్లకు గుడి ఎందుకు కట్టలేదో తెలుసా? కారణం ఇదే!
Follow Us