MEIL Corruption: మేఘాకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు?

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మేఘా సంస్థ అక్రమాలపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వేసిన పిల్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. స్వతంత్ర దర్యాప్తు అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణ మే 13నుంచి జరగనుంది.

New Update
MEGHA Krishan Reddy

Palamuru-Ranga Reddy lift irrigation scheme case Supreme Court hearing

MEIL Corruption: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిల్ శుక్రవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్‌లు నాగం జనార్దన్, మేఘా సంస్థ తరఫు న్యాయవాదుల వాదనలు విన్నారు. ఈ సందర్భంగా 2024 డిసెంబర్‌లో విచారణ సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు BHEL (Bharat Heavy Electricals Limited) అఫిడవిట్ దాఖలు చేసింది. ఎత్తిపోతల పథకంలో వినియోగించిన యంత్రాలు, వాటి బిల్లులు, తను పోషించిన పాత్ర గురించి BHEL అఫిడవిట్‌లో వివరంగా పేర్కొంది. 

ఆరోపణలను నిజం చేస్తున్నాయి..

ఈ మేరకు విచారణలో BHEL కౌంటర్ చేసిన అఫిడవిట్‌లో తమ ఆరోపణలను నిజం చేస్తున్నాయని నాగం జనార్దన్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానానికి వివరించారు. ప్రభుత్వ టెండర్‌లో 3వ వంతు కూడా BHEL సంస్థకు చెల్లించలేదని అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, కావున వెంటనే స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. దీంతో BHEL దాఖలు చేసిన అఫిడవిట్, నాగం ఫైల్ చేసిన రిజాయిండర్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. 

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

3 పిటిషన్లు కొట్టివేత..

మరోవైపు తెలంగాణ హైకోర్టులో 3 పిటిషన్లు ఇప్పటికే కొట్టివేశారని మరికొన్ని పెండింగ్‌లో ఉన్నట్లు మేఘా సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ ముకుల్ రోహత్గి వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం స్వతంత్ర దర్యాప్తుకు అప్పగించే అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణ మే 13 నుంచి జరుపుతామని జస్టీస్ సంజీవ్ కుమార్‌ల స్పష్టం చేసింది. 

ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

2017లో పిటిషన్..
నాగం జనార్దన్ రెడ్డి 2017లో బీజేపీలో ఉన్న సమయంలో హైకోర్టులో ఈ విషయానికి సంబంధించి పిల్ దాఖలు చేశారు. BHEL, MEIL మధ్య సంయుక్త ఒప్పందానికి కాంట్రాక్ట్ కేటాయింపు చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. ఈ కాంట్రాక్ట్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 2000 కోట్లకు పైగా నష్టం కలిగిందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రాజెక్టులో ఉపయోగించే పరికరాల విలువను మోసపూరితంగా రూ. 5,960 కోట్ల నుంచి రూ. 8,386 కోట్లకు పెంచారని అన్నారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ పిటిషన్  హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

High Court: ఎస్సీ వర్గీకరణ చట్టం చెల్లదు.... హై కోర్టులో సంచలన పిటిషన్లు

రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మరో రెండు పిటిషన్‌లు దాఖలయ్యాయి. మాలమహానాడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ ఆధారంగా జరిగిందని పిటిషన్ లో పేర్కొంది.

New Update
sc categorization

sc categorization

High Court:  రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మరో రెండు పిటిషన్‌లు దాఖలయ్యాయి. మాలమహానాడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ ఆధారంగా జరిగిందని పిటిషన్ లో పేర్కొంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ చేశారని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు ఆధారంగా డేటాను సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. 

సుప్రీంకోర్టు సూచించిన విధంగా సంపన్న శ్రేణి నిబంధనను అమలు చేయలేదని పేర్కొంటూ ఇప్పటికే పిటిషన్‌ దాఖలయింది. దానికి తోడుగా.. చట్టబద్ధమైన డేటా ఏదీ లేకుండా ఏకసభ్య కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేపట్టిన వర్గీకరణ చెల్లదని పేర్కొంటూ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, ఎస్సీ ఐక్య వేదిక ఉపాధ్యక్షుడు గడ్డం శంకర్‌ రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్సీ వర్గీకరణపై   కేసు విచారణకు స్వీకరించే సమయంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ రేణుకా యార ధర్మాసనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా ఎస్సీ వర్గీకరణ జరగలేదా.? అని ప్రశ్నించింది.పిటిషనర్ల తరఫున న్యాయవాది డీవీ సీతారామ్మూర్తి వాదిస్తూ ఏకసభ్య కమిషన్‌ ఇచ్చిన నివేదికకు చట్టబద్ధత లేదని తెలిపారు. దీనిపై సవివరంగా వాదనలు వినాల్సి ఉందన్న ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది

Also Read: Russia-Ukrain-Putin: ఉక్రెయిన్‌ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
 
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు డీవీ సీతారాం మూర్తి తన వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వెనుకబాటుతనాన్ని నిర్ణయించడానికి  డేటా చాలా కీలకమని పేర్కొన్నారు.  పిటిషన్ పై విచారణ జరిపేందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరిచింది. కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.

Also Read:BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఏపీ హైకోర్టులో వ్యాజ్యం....రేపు విచారణ

అటు ఏపీలోనూ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాలను (ఆర్డినెన్స్‌) సవాలుచేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు పరస సురేష్‌కుమార్‌ ఈ పిటిషన్‌ వేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ ఆర్డినెన్స్‌ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రణాళిక మంత్రిత్వ శాఖ (నీతి ఆయోగ్‌), రాష్ట్ర ప్రణాళిక, సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు, డైరెక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది. 

Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

‘2023 నవంబర్‌ 20న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ‘కుల ఆధారిత సర్వే’ చేసింది. ఈ సర్వేకు చట్టబద్ధత లేదు. పైగా సక్రమంగా పరిశీలించకుండా చేసిన ఈ సర్వే డేటాపై ఆధారపడి ఏకసభ్య కమిషన్‌ ఎస్సీ వర్గీకరణకు సిఫారసు చేసింది. సమగ్ర, కచ్చితమైన డేటా ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు ఇది విరుద్ధం. దీన్ని పరిగణనలోకి తీసుకొని, జనాభా లెక్కల చట్ట నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం, పర్యవేక్షణలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై వాస్తవ పరిస్థితుల అధ్యయనానికి నిపుణులతో స్వతంత్ర కమిషన్‌ వేసేలా ఆదేశాలివ్వండి. ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటుపై 2024 నవంబర్‌ 15న ఇచ్చిన జీవో 86ను రద్దు చేయండి. ఎస్సీ కులాల సోషల్‌ ఆడిట్‌ కోసం విధివిధానాలను రూపొందిస్తూ సాంఘిక సంక్షేమశాఖ గతేడాది డిసెంబర్‌ 20న జారీచేసిన జీవో 91ని కొట్టేయండి. వర్గీకరణ ఆర్డినెన్స్‌ అమలును సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి’ అని పిటిషనర్‌ కోరారు.

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment