TG Politics: వివేక్, బాల్క సుమన్ సీక్రెట్ మీటింగ్.. అసలేం జరుగుతోంది?
తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి దాదాపు 30 నిమిషాల పాటు భేటీ కావడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి దాదాపు 30 నిమిషాల పాటు భేటీ కావడం చర్చనీయాంశమైంది.
BRS నాయకులపై అక్రమ కేసులు పెట్టే వారికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. కేసీఆర్ అంత మంచోడిని కాదని కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ సన్నాహక సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదివారం కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కరీంనగర్లో పర్యటించనున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వచ్చేనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరనుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాతనే కేటీఆర్ చెన్నై వెళ్లాడన్నారు. వంద రోజుల్లో బీఆర్ఎస్ అవినీతిని బయటపెడతానన్న రేవంత్.. ఎందుకు ఆ పని చేయడం లేదన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన నిఖిల్ సూసైడ్ చేసుకున్నాడు. ఆన్లైన్లో గేమ్ ఆడి రూ.4 లక్షలు అప్పు చేశాడు. అవి తీర్చలేక బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
ఆన్లైన్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కోరబోయిన సాయి తేజ (25) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. రూ.10లక్షలకు పైగా అప్పులపాలై వాటని కట్టలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మానకొండూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే రసమయి మధ్య ట్విట్టర్ వార్ నడించింది. గతకొంతకాలంగా ఈ ఇద్దరి నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు రసమయి ఇంటి ముట్టడికి యత్నించారు.
తెలంగాణ బడ్జెట్‌పై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ బడ్జెట్ చూస్తుంటే రేవంత్ సర్కార్ 40 శాతం కమిషన్ పాలన అనిపిస్తుందని, ఢిల్లీకి మూటలు కడుతున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. దీంతో పక్క రాష్ట్రాలకు మూటలు మోస్తేనే ప్రజలు వాతలు పెట్టారంటూ మంత్రి సీతక్క కౌంటర్ వేశారు.
తెలంగాణ అసెంబ్లీ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ బిల్లును పొన్నం ప్రభాకర్, ఎస్సీ వర్గీకరణ బిల్లును దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టారు.