/rtv/media/media_files/2025/03/19/zPqkWAOzEmW6raRRicTh.jpg)
మానకొండూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య ట్విట్టర్ వార్ నడించింది. గతకొంతకాలంగా ఈ ఇద్దరి నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయు కామెంట్స్ కు సహానం కోల్పోయిన కాంగ్రెస్ కార్యకర్తలు రసమయు ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో మానకొండూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
బాలకిషన్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం
స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నిస్తే అనుచరులను, కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొల్పి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిపై దాడి చేయించడం దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రసమయి బాలకిషన్ గారి భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు పునరావృతం కాకుండా సీపీ సిద్దిపేట, తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ రావు ట్వీట్ చేశారు.
అయితే హరీష్ రావు ట్వీట్ పై ఎమ్మెల్యే కవ్వంపల్లి స్పందించారు. మీ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి, సవాళ్లు విసిరి విజ్ఞత లేకుండా నిందారోపణలు చేశారు. ఆధారాలు చూపించి ధైర్యంగా ఎదుర్కోమంటే.. దాక్కున్న వైఖరిని మీరు సమర్థిస్తున్నారా? లేక ఏదో ఒక విధంగా విష ప్రచారాలు చేసి అభివృద్ధిని అడ్డుకునే మీ మాజీ ఎమ్మెల్యేకు మీరు అండగా నిలబడుతున్నారా? సవాలు విసిరితే తీసుకోవడం రాజకీయ నాయకుడి ముఖ్య లక్షణం, దమ్ముంటే రండి అంటే దాక్కునే వైఖరి మాది కాదు, మేం ప్రజాస్వామ్యానికి కట్టుబడి వుండే సిద్ధాంతాలు కలిగిన వాళ్ళము. ఓపిక నశించిన కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యే అనుచిత వ్యాఖ్యలు, అవాస్తవాల కట్టడి చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారా అంటూ ప్రశ్నించారు.
Mr.@DrKavvampally హైదరాబాదులో దక్కున్నది, హైదరాబాదు దాటి రానిది నువ్వు, ప్రజల మధ్య ఉంటుంది నేను. CM relief fund లో నీ కార్యకర్తలు మరియు నీవు చేసిన కుంభకోణం అబద్దమే అయితే నీ అనుచరులను పోలీసులు అరెస్టు ఎందుకు చేసినట్టు? నియోజకవర్గం లో పంటలు ఎండిపోయి రైతులు అన్నమో రామచంద్ర అంటూ… https://t.co/1iTEgeY1jX
— Rasamayi Balakishan (@RasamayiBRS) March 19, 2025
ఎమ్మెల్యే కవ్వంపల్లి ట్వీట్ రసమయు స్పందించారు. హైదరాబాదులో దక్కున్నది, హైదరాబాదు దాటి రానిది నువ్వు, ప్రజల మధ్య ఉంటుంది నేను. సీఎం రిలీఫ్ ఫండ్ లో నీ కార్యకర్తలు మరియు నీవు చేసిన కుంభకోణం అబద్దమే అయితే నీ అనుచరులను పోలీసులు అరెస్టు ఎందుకు చేసినట్టు? నియోజకవర్గంలో పంటలు ఎండిపోయి రైతులు అన్నమో రామచంద్ర అంటూ పెద్దలింగాపూర్ రైతులు నీళ్ల కోసం కన్నిరూపెడుతుంటే పరమర్శించాల్సింది పోయి, వాళ్ళని అవమానిస్తూ మాట్లాడినందుకు వాళ్ల తరపున నేను ప్రశ్నించినందుకా దాడి? నువ్వు నీ అనుచరులను ఉసిగొల్పి నాపై నువ్వు చెయ్యించాలనుకుంటున్న దాడికి భయపడే వ్యక్తిని కాదు. అమాయక కార్యకర్తలను బలిచేయడం ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే నువ్వే రా.. నీ కమిషన్లు దోపిడీ ఆధారాలతో సహా నేను వొస్త.. తేల్చుకుందాం రా కమీషన్ల నారాయణ. అంటూ రసమయు ట్వీట్ చేశారు.
Also Read : ఫిక్స్.. రేపే చాహల్తో విడాకులు.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం!