/rtv/media/media_files/2024/12/20/8idMArXNyw7qoso7Vvvm.jpg)
Telangana budget issue sethakka strong counter to KTR
TG News: తెలంగాణ బడ్జెట్ పై మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన బడ్జె్పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ బడ్జెట్ చూస్తుంటే రేవంత్ సర్కార్ 40 శాతం కమిషన్ పాలన అనిపిస్తుందని, ఢిల్లీకి మూటలు కడుతున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన మంత్రి సీతక్క.. కేసీఆర్ మాటలు ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు.
మిలినీయం జోక్..
ఈ మేరకు ఇతర రాష్ట్రాలకు మూటలు మోసింది కేటీఆర్, కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఆ మూటలు తీసుకున్నవారంతా ఆగం అయ్యారని సెటైర్స్ వేశారు. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడడం మిలినీయం జోక్. రాష్ట్రాన్ని మోయలేనంత అప్పుల కుప్పగా మార్చారు. బీఆర్ఎస్ బడ్జెట్ అంతా కోతల బడ్జెట్. అందుకే ప్రజలు వాతలు పెట్టారు. మాది అహో ఓహో భజన బడ్జెట్ కాదు. మహిళా, రైతు, యువత, అట్టడుగు వర్గాల సంక్షేమ బడ్జెట్. 100% ఇది వాస్తవిక బడ్జెట్. వాస్తవాలను ప్రతిబింబించే బడ్జెట్. సాంఘీక సంక్షేమ శాఖ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కి అధిక నిధులు కేటాయించాం. గుంట భూమి లేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పారు.
Also read : బెట్టింగ్ యాప్‌లో మాజీ మంత్రి హస్తం.. ఫామ్ హౌస్ వేదికగా బ్లాక్ దందా?
మహిళా శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకుని అధిక నిధుల కేటాయించామని చెప్పారు. ఆర్థిక ఒత్తిడిలో ఉన్నా 6 గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యతనిచ్చామని అన్నారు. ఆర్థిక అవకాశాలు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర బడ్జెట్. 100% మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన బడ్జెట్. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని మరింత బలోపేతం చేసే దిశలో, మహిళలకు మరిన్ని వ్యాపార అవకాశాలు కల్పించేలా తమ బడ్జెట్ ఉందన్నారు.
Also read : ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని.. ఫొటోలు వైరల్