నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు : KTR

BRS నాయకులపై అక్రమ కేసులు పెట్టే వారికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. కేసీఆర్ అంత మంచోడిని కాదని కేటీఆర్ అన్నారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ సన్నాహక సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదివారం కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

New Update
KTR

KTR

అధికార పార్టీ రాజకీయ నాయకులు చెప్పినట్లు విని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బంది పెడుతున్న అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను హింసిస్తున్న అధికారులు, పోలీసులకు మా పార్టీ అధికారంలో రాగానే వారికి బుద్ధి చెబుతామని అన్నారు. అప్పుడు వారిని కేసీఆర్ వదిలేసినా.. నేను విడిచిపెట్టనని కార్యకర్తలకు దైర్ఘ్యం చెప్పారు. ఆయన కేసీఆర్ అంత మంచోడిని కాదని అన్నారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ సన్నాహక సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదివారం కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు రెండే అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలిపెట్టమని అన్నారు. ఈ సందర్భంగా తాను కేసీఆర్ అంత మంచోడు కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అని ఆయన చెప్పారు.

Also read: Meerut Murder case: జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్

బీఆర్ఎస్ నాయకులను చూసి అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయని అన్నారు. బండి సంజయ్‌ను ఏది అడిగినా శివం, శవం ముచ్చట చెప్పారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు బీదర్‌లొ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉందని మర్చి పోయావా అని బండి సంజయ్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. అయోధ్య తలంబ్రాల పేరిట సెంటి‌మెంట్‌కి తెరలేపారని ఆయన అన్నారు. బడి, గుడి ఊదైనా బీఆర్ఎస్ నాయకునే కట్టారని చెప్పుకొచ్చారు.

Also read: AC explosion: ఇంట్లో AC పేలి ఫ్యామిలీలో నలుగురు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

Advertisment
Advertisment
Advertisment