కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఎమ్మెల్సీ రాలేదన్న అసంతృప్తి ఉందన్నారు. రెన్యువల్ అవుతుందని భావించా కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసంతృప్తి లేదని చెబితే మొహమాటానికి చెప్పినట్లు ఉంటుందని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 40ఏళ్లు ప్రజల మధ్యే ఉన్నానని చెప్పిన జీవన్ రెడ్డి.. ఇకపై కూడాఉంటానని తెలిపారు. ప్రజా జీవితానికి బ్రేక్ వేసుకోవాలని లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం ఆమోదం తెలిపిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ల గా మారాయి.
ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం
మరోవైపు తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలు, అలాగే ఒక రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో స్థానం లభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ.. రాష్ట్ర కోర్ కమిటీ నుంచి వివరాలు తీసుకుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలను సేకరించింది.
Also read : బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీసీలో ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్‌కు రానుంది. ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా రాష్ట్రంలో ఆరు మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో నాలుగైదు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మైనార్టీలకు ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది.
Also Read : విషాదం..వాటర్ హీటర్ బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
Jeevan Reddy : కాంగ్రెస్లో అసంతృప్తి గానే ఉన్నా..జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్!
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఎమ్మెల్సీ రాలేదన్న అసంతృప్తి ఉందన్నారు. రెన్యువల్ అవుతుందని భావించా కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చారు. ప్రజా జీవితానికి బ్రేక్ వేసుకోవాలని లేదని స్పష్టం చేశారు.