BRS Working President KTR : నేడు కరీంనగర్‌ కు కేటీఆర్‌....ఎక్కడికక్కడ అరెస్ట్‌లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కరీంనగర్‌లో పర్యటించనున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వచ్చేనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

New Update
BRS Working President KTR

BRS Working President KTR

BRS Working President KTR :  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కరీంనగర్‌లో పర్యటించనున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. వచ్చే నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని పది మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి తరలి రానున్నారు.. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని వి కన్వెన్షన్ లో జరిగే ఈ సమావేశానికి ముఖ్య కార్యకర్తలు హాజరు కానున్నారు. వరంగల్ లో వచ్చే నెల 27 వ తేదీన జరిగే పార్టీ రజతోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే కేటీఆర్ సూర్యాపేటలో పర్యటించిన సంగతి తెలిసిందే. వరసగా అన్ని జిల్లాలను కేటీఆర్ పర్యటిస్తున్నారు. కార్యకర్తలలో, నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ కరీంనగర్ రాక సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: రాజీవ్‌ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం


 ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాది మంది ముఖ్య కార్యకర్తలు తరలి రానుండగా.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డులోని వీ కన్వెన్షన్‌లో జరిగే సభకు ఐదు వేలకు పైగా ముఖ్యకార్యర్తలు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.కేటీఆర్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చేప్పేందుకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌లోని రాంనగర్‌ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై, తెలంగాణచౌక్‌, కమాన్‌మీదుగా సభాప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. స్వాగతం తర్వాత జరిగే సభలో.. కేటీఆర్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.

Also Read: కిచెన్ లో ఖాళీ బుల్లెట్లతో పోలీస్ ఆఫీసర్ ప్రయోగం.. చివరికి ఏమైందంటే..?

ఈ సమావేశాన్ని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పార్టీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరు కానున్నారు. శనివారం వీకన్వెన్షన్‌ ఫంక్షన్‌హాల్‌ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఏర్పాట్లు పరిశీలించారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్‌ మెంబర్లు, డివిజన్‌ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Also Read: బెల్జియంలో ఛోక్సీ..రప్పించేందుకు భారత్‌ విశ్వ ప్రయత్నాలు!

బీఆర్ఎస్ నేతల అరెస్ట్ లు

కాగా కరీంనగర్ లో జరగనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం శతావిధాల ప్రయత్నిస్తుంది. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముఖ్యనేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. కరీంనగర్ లో జరిగే బీఆర్ఎస్ సమావేశానికి వెళ్ళకుండ నాయకులను అడ్డుకోవడం సరికాదని నాయకులు అభిప్రాయపడ్డారు.మల్లాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?

Advertisment
Advertisment
Advertisment