Betting Apps: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌‌‌తో లక్షల్లో అప్పులు.. కరీంనగర్ జిల్లా యువకుడు సూసైడ్!

ఆన్‌లైన్ బెట్టింగ్‌ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మన్నెంపల్లికి చెందిన నిఖిల్ సూసైడ్ చేసుకున్నాడు. ఆన్‌లైన్‌లో గేమ్ ఆడి రూ.4 లక్షలు అప్పు చేశాడు. అవి తీర్చలేక బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు.

New Update
Karimnagar youth committed suicide due to betting apps

Karimnagar youth committed suicide due to betting apps

ఒకవైపు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకుని.. అప్పులపాలై ఇంకొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

తాజాగా అలాంటిదే జరిగింది. తెలంగాణలోని హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్ ఆడి లక్షల్లో అప్పులపాలయ్యాడు. ఏం చేయాలో తెలియలేదు. మరణం ఒకటే మార్గమని నిర్ణయించుకున్నాడు. దీంతో బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన నిఖిల్ అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. తరచూ బెట్టింగ్ ఆడటంతో దానికి బాగా బానిసయ్యాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని లక్షల్లో అప్పలు చేసి బెట్టింగ్ ఆడాడు. కొంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత నష్టాలు రావడంతో కుమిలిపోయాడు. 

Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

అప్పటికే రూ.4 లక్షల అప్పు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది. 

మరో ఘటన

ఇలాంటిదే మరో ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయి తేజ (25) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

Also Read: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!

రూ.10లక్షలకు పైగా అప్పులు

గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో కాపురం పెట్టాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తు్న్న సాయితేజ్.. బెట్టింగులకు బానిసయ్యాడు.  ఈ క్రమంలో రూ.10లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. వాటని కట్టలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో మార్చి 18వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి సాయి తేజ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మంథనికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

(betting apps case | betting case | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు