BIG BREAKING: 'ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్'

ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరనుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాతనే కేటీఆర్ చెన్నై వెళ్లాడన్నారు. వంద రోజుల్లో బీఆర్ఎస్ అవినీతిని బయటపెడతానన్న రేవంత్.. ఎందుకు ఆ పని చేయడం లేదన్నారు.

New Update
CM Revanth KTR

CM Revanth KTR

సీఎం రేవంత్ తో హరీష్ రావు భేటీ తర్వాతే కేటీఆర్ చెన్నై వెళ్లారని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై సమావేశం తరువాత రేవంత్  బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బయట పడిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ  ఇండియా కూటమిలో లేదన్నారు. అయినా కేటీఆర్ చెన్నై మీటింగ్ కు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో బీఆర్ఎస్ కలుస్తుందా? లేక పోతే మరెందుకు కేటీఆర్ అఖిల పక్షం మీటింగ్ కి వెళ్లారని? ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు..

బీఅర్ఎస్ అవినీతిని వంద రోజుల్లో బయటపెడతానని సీఎం రేవంత్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. అయితే.. అధికారంలోకి వచ్చి15 నెలలు గడుస్తున్నా బీఅర్ఎస్ అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు. ఈ మీటింగ్ తో రెండు పార్టీల మధ్య రహస్య  ఒప్పందం కుదిరింది అనే అనుమానాలకు బలం చేకూరిందన్నారు.
ఇది కూడా చదవండి: Komatireddy-Balakrishna: బాలయ్య వేస్ట్.. ఆ విషయంలో నేనే బెస్ట్.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

 

(Ktr | revanth-reddy | aleti-maheshwar-reddy | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు