/rtv/media/media_files/2025/03/21/OoY37SjNdyBHykVxi6Fg.jpg)
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయి తేజ (25) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలి
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2025
బెట్టింగ్ యాప్‌లతో నష్టపోయి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కోరవేన సాయి తేజ అనే యువకుడు
సాయి తేజ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం
గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సాయి తేజ
మూడు రోజుల క్రితం రామగిరి మండలం… pic.twitter.com/nsbXU33cXM
Also read : హైదరాబాద్‌లో తక్కువ ధరకే మేక, గొర్రె మాంసం...ఇది తింటే ఇక బతికినట్టే..
రూ.10లక్షలకు పైగా అప్పులు
గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో కాపురం పెట్టాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తు్న్న సాయితేజ్.. బెట్టింగులకు బానిసయ్యాడు. ఈ క్రమంలో రూ.10లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. వాటని కట్టలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో మార్చి 18వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి సాయి తేజ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మంథనికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Online Betting: మధురానగర్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్..ముఠా అరెస్ట్
తెలంగాణ ప్రభుత్వం సీరియస్
మరోవైపు బెట్టింగ్ ప్రమోషన్స్ ను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఏడాదిలో 25 మంది బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నమోదైన కేసుల ఆధారంగా ఆయా బెట్టింగ్ యాప్స్ ను గుర్తించే పనిలో పడ్డారు.
Also read : బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తే తప్పని ఎలా తెలుస్తుంది ? అనన్య నాగల్ల సంచలన వ్యాఖ్యలు
Also read : ఐపీఎల్ టీమ్స్ వెనుకున్న పెద్ద మనుషులు ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?