USA: ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన రష్యా..నో అన్న చైనా
రక్షణ ఖర్చులు తగ్గించుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. కానీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ మాత్రం నో వే అని చెప్పేశారు.
రక్షణ ఖర్చులు తగ్గించుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. కానీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ మాత్రం నో వే అని చెప్పేశారు.
చైనా కంపెనీ పెళ్లి కాని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లయి డివోర్స్ తీసుకున్నవారు, కానీ వారందరూ సెప్టెంబర్‌లోగా వివాహం చేసుకోవాలని తెలిపింది. చైనా జనాభా తగ్గుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇండియాతో వైరం పెట్టుకున్న బంగ్లాదేశ్ చైనాతో దోస్తీకి ఉవ్విళూరుతోంది. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, విద్యావేత్తలతో కూడిన 22 మంది సభ్యుల బృందం చైనాలో 10 పర్యటన చేస్తోంది.
చైనాలో కొవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పుగా భావిస్తున్నారు. దీన్ని'హెచ్‌కెయూ5- కోవ్-2’గా పిలుస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఫిలిప్పీన్ ను చైనా భయపెట్టింది. ఆదేశ విమానానికి చైనా హెలికాఫ్టర్ అత్యంత సమీపంగా వెళ్ళడంతో ప్రమాదం తప్పదనే అందరూ అనుకున్నారు. విమానం కూలిపోవలసిందే అని డిసైడ్ అయిపోయారు. అయితే అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు.
చైనాను భారత్ శత్రు దేశంగా చూడొద్దని శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.చైనా విషయంలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని తెలిపింది. ఆ మాటలు కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబించడం లేదని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ఓవర్సీస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్.. చైనాను శత్రువులా చూడొద్దని వ్యాఖ్యానించారు. ఆ దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇకనుంచైనా భారత్ తన తీరు మార్చుకోవాలన్నారు.
చైనాలో జూ పార్కులు మోసం చేస్తున్నాయి. గాడిదలకు నలుపు, తెలుపు రంగులేసి జీబ్రాలా చిత్రికరిస్తున్నారు. ఇలా చేసి జూలకు రద్దీ పెంచుకుంటున్నాయి. దీనిపై అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చైనా జూ పార్కులు ఇలా మోసం చేశాయి.