/rtv/media/media_files/2025/04/03/9FVaTTkVR8tpsbGzExCD.jpg)
trump tax on india Photograph: (trump tax on india)
టారిఫ్స్ విషయంలో అమెరికా అన్నీ దేశాలపై కఠిన వైఖరి అవలంభిస్తుంది. కానీ అమెరికాకు భారత్‌తో మంచి దౌత్యసంబంధాలు ఉన్నాయి. ఈక్రమంలోనే భారత్‌పై అమెరికా ఇతర దేశాలకంటే తక్కువ పన్నులు విధించింది. అమెరికాలోకి దిగుమతి అయ్యే భారతీయ ఉత్పత్తులలై ట్రంప్ కొత్త టారిఫ్స్ కింద 26 శాతం పన్ను విధించబడనుంది. కానీ ఈ తీవ్రత ట్రంప్ చైనాపై విధించిన 34 శాతం కంటే తక్కువగా ఉండటమే కలిసొస్తోన్న విషయం. ట్రంప్ అధిక టారిఫ్స్ కారణంగా డ్రాగన్ దేశం అమెరికా మార్కెట్లలో తన వస్తువులను గతంలో కంటే ఎక్కువగా విక్రయించాల్సి ఉంటుంది. అంటే ఒక విధంగా ఇండియా ఉత్పత్తుల కంటే కూడా ఈ ధరలు అధికంగా ఉంటాయి. ఈ పరిస్థితులు అమెరికా మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు చవక రేట్లకు ఆఫర్ చేయటానికి దోహదపడుతుంది.
"India very very tough, PM .@narendramodi is great friend of Mine. India charge us 52%. But we'll charge only 26%. 26% Discount for India"- Trump.
— BhikuMhatre (@MumbaichaDon) April 3, 2025
Btw, US has imposed 34% tariff on 'Royal Family of India's" Owner... China. This 34% + Existing 20% = Total 54%.😊
Mudi is weak &… pic.twitter.com/wACdqmsjCS
చైనాపై అధిక పరస్పర పన్నులను అమెరికా ప్రకటించటం వల్ల.. భారత వస్త్ర పరిశ్రమ, ఫుట్‌వేర్, ఫ్యాషన్, టెక్స్ టైల్ రంగాల ఉత్పత్తులు ఎక్కువగా అమెరికాకు షిప్మెంట్ చేసేందుకు అవకాశాలు పెరిగాయని భారత ప్రభుత్వ వర్గాలు ప్రస్తుత పరిస్థితుల అధ్యయనం ద్వారా వెల్లడించాయి. ఇదే క్రమంలో ఇండియా తన ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తులను చైనా కంటే తక్కువ రేట్లకు అమెరికాకు ఎగుమతి చేయటానికి వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిబ్రవరిలోనే భారత ప్రధాని మోదీ యూఎస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఈసారి అధిక పన్నుల దిశగా వెళ్లాలని నిర్ణయించినందున ముందుగానే చర్చల్లో పాల్గొనటం ప్రస్తుతం పరస్పర సుంకాల్లో కొంత తక్కువ రేట్ల ప్రకటనకు దారితీసిందనే వాదనలు కూడా ఉన్నాయి. మిత్రదేశంగా ఉన్న భారత్ పై ట్రంప్ సుంకాలు కొత్త వ్యాపార అవకాశాలను కూడా తీసుకురావటం గమనార్హం. భారత్ అమెరికా ఉత్పత్తులపై కొనసాగిస్తున్న భారీ సుంకాలు.. అమెరికన్ కంపెనీలు తమ ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించడాన్ని కష్టతరంగా, ఖరీదైనదిగా మార్చుతోందని వైట్ హౌస్ అప్పట్లో చేసిన ప్రకటనలో పేర్కొంది.