/rtv/media/media_files/2024/11/03/0T7C16oNbbO2cBGQtcDU.jpg)
చైనా భయపడింది. తప్పుడు నిర్ణయం తీసుకుంది అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వారికి మరో మార్గం లేదు అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికా టారీఫ్ లకు ప్రతిగా చైనా విధించిన 34శాతం సుంకాలపై ట్రంప్ స్పందించారు. అసలు ముందు నుంచీ చైనా గోలపెడుతూనే ఉంది. యూఎస్ విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. అగ్రరాజ్యం ేకపక్షంగా వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని చైనా అంటోంది. ట్రంప్ విధించిన సుంకాలపై ఇప్పటి వరకు కెనడా, చైనాలు మాత్రమే ధీటుగా సమాధానాలు చెప్పాయి. దానికి ప్రతిగా ఆ దేశాలు కూడా సుంకాలను పెంచాయి. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపైనా చైనా 34శాతం విధిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు ఇది వర్తిస్తుందని, ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ తెలిపింది.
ప్రపంచ ఆర్ధిక మాంద్యం దిశగా?
ఇక మరోవైపు ట్రంప్ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని, కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని మరింత పెరుగుతుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికాతో పాటు అన్ని ప్రధాన మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి. దీనికి సంబంధించి క్యాపిటల్ మార్కెట్ కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ క్యాపిటల్ అడ్వైజర్స్ సీఈఓ జేహాట్‌ఫీల్డ్ మాట్లాడారు. '' ట్రంప్ ప్రకటన మార్కెట్లకు దారుణమైన పరిస్థితి. అమెరికాను మాంద్యంలోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని'' అన్నారు. ''ఈ వ్యవహారంలో మనం ఒకవైపే చూస్తున్నాం. కానీ మనం చేసే దానికి ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ముఖ్యం. మొత్తానికి మార్కెట్ ఈ పరిస్థితులను ఎలా తీసుకుంటుందో చూడాలని'' గ్రీన్‌వుడ్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ వాల్టర్ టాడ్ వ్యాఖ్యానించారు.
today-latest-news-in-telugu | usa | china | donald trump tariffs
Also Read: TS: ఉత్తమ విద్యావస్థ కోసం కొత్త పాలసీ..సీఎం రేవంత్ రెడ్డి