USA: ప్రేమ , శృంగారం వద్దు..అమెరికన్లకు ట్రంప్ ఉత్తర్వులు

ప్రేమ, రొమాన్స్ అంటూ అమ్మాయిలు, అబ్బాయిల వెంట పడకండి..అన్నీ మూసుకుని కూర్చోండి అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ముఖ్యంగా చైనా వారితో అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకో తెలుసా..

New Update
usa

USA, China

తన సొంత దేశ ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమెరికా అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. మగవారు అమ్మాయిల వెంట పోకండి. ఆడవాళ్ళు మగవాళ్లకు దూరంగా ఉండండి అని చెబుతున్నారు. ప్రేమ, శృంగారంలాంటివన్నీ కొన్నాళ్ళు పక్కన పెడితే మంచిదని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు సంబంధాల్లోకి దిగొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా చైనా వాళ్ళకు చాలా దూరంగా ఉండండి అంటూ హితవు పలికారు. ట్రంప్ ఇంతకీ ఇదంతా ఎవరికి ఎందుకు చెబుతున్నారో తెలుసా..

Also Read: USA: గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు

అలాంటివేమీ వద్దు..దూరంగా ఉండండి..

చైనాలో పనిచేస్తున్న అమెరికన్లకు అధ్యక్షుడు ఆంక్షలు పెట్టారు. ఆ దేశంలోని అమెరికాన్ అధికారులు, ఉద్యోగులకు ఈ హెచ్చరికలు జారీ చేశారు. చైనాలో హనీ ట్రాప్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని...దాని ద్వారా తమ దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాలని చైనీయులు చూస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దానిని అరికట్టాలంటే మాన సంబంధాలు ఉండకూడదని...అదీ ముఖ్యంగా చైనీయులతో అస్సలు వద్దని ఆదేశాలు జారీ చేశారు. చైనాలో నియమించబడిన తమ ప్రభుత్వ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, భద్రతా అనుమతి ఉన్న కాంట్రాక్టర్లు చైనా పౌరులతో ఎటువంటి ప్రేమ లేదా లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదంటూ అమెరికా ప్రభుత్వం నిషేధించింది. ఇది మూడు నెలల క్రితమే అంటే జనవరి నుంచే అమల్లోకి వచ్చింది. అయితే మళ్ళీ ఇందులో ఇప్పటికే చైనా పౌరులతో సంబంధాలు కలిగి ఉన్న అమెరికన్ పౌరులకు మాత్రం ఈ కొత్త నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిఘా సంస్థలు సున్నితమైన సమాచారాన్ని పొందడానికి చాలా కాలంగా ఆకర్షణీయమైన పురుషులు, స్త్రీలను ఉపయోగిస్తున్నాయి. అమెరికాకు మెయిన్ శత్రువు ప్రస్తుతానికి చైనా ఒక్కటే. ఎప్పుడు తమ భద్రతా సమాచారాలను చైనా దొంగిలించడానికి చూస్తుంటుందని అమెరికా ఆరోపిస్తూనే ఉంటుంది. 

 today-latest-news-in-telugu | usa | china | trump | romance

Also Read: Business: భారీ నష్టాల్లో సూచీలు..స్టాక్ మార్కెట్ కుదేలు

Advertisment
Advertisment
Advertisment