INdia: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్

భారతదేశం స్థూల జాతీయోత్పత్తి బాగా పెరిగింది. పదేళ్ళల్లో ఇది డబుల్ అయింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ..2025నాటికి 4.3 ట్రలియన్ల డాలర్లకు చేరడం ద్వారా గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని చెబుతోంది ఐఎమ్ఎఫ్. 

New Update
GDP Statistics : ఊహించిన దానికంటే ఎక్కువగా.. జీడీపీ వృద్ధి.. ఎంతంటే.. 

లాస్ట్ పదేళ్ళుగా భారత ఆర్ధిక పరిస్థితి మీద అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. దాని ప్రకారం భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పింది. ఐఎమ్ఎఫ్ డేటా ప్రకారం  పదేళ్ళల్లో భారత్ 77 శాతం వృద్ధిని నమోదు చేసింది.  2015లో 2.4 ట్రిలియన్ల డాలర్ల ఉన్న భారత జాతీయోత్పత్తి.. 2025 వచ్చేసరికి 4.3 ట్రిలియన్ల డాలర్లకు పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ది భారత్ ను ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో చేర్చింది. ఇదే స్పీడ్ తో ఇండియా ఉంటే..2025లో జపాన్‌ను అధిగమించడమే కాక 2027 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందని తెలిపింది. 

చైనా కూడా పరుగెడుతోంది..

ఇక మిగతా దేశాల అభివృద్ధిని కూడా ఐఎమ్ఎప్ విడుదల చేసింది. పక్క దేశమైనా చైనా గురించి చెబుతూ  పదేళ్ళల్లో ఆ దేశం 74 శాతం జీడీపీ వృద్ధిని సాధించింది. 2015లో 11.2 ట్రిలియన్ల డాలర్ల నుంచి 2025లో 19.5 ట్రిలియన్ల డాలర్లకు పెరిగిందని వివరాలను ప్రకటించింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అమెరికాను మాత్రం అధిగమించలేకపోయిందని చెప్పింది. కోవిడ్ ఎఫెక్ట్, దానివల్ల ఆ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు చైనాను కిందకు లాగేశాయి. 

పెద్దన్న ఎప్పటికీ అమెరికానే..

మరోవైపు అమెరికా మాత్రం ఎప్పటిలానే ప్రపంచ పెద్దన్నగా ఉంది. అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా తన హోదాను నిలుపుకుంది.  2015లో అమెరికా జీడీపీ 23.7 ట్రిలియన్ల డాలర్లు ఉండగా.. 2025లో 30.3 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. ఇది పదేళ్లో 28శాతం వృద్ధి రేటును సూచిస్తుంది. లెక్కల్లో ఆసియా దేశాల కన్నా తక్కువ ఉన్నా...ఆధిపత్యం మాత్రం అమెరికానే కొనసాగిస్తోంది.  ఇక UK, ఫ్రాన్స్, జర్మనీ ,జపాన్ వంటి ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు పదేళ్లో 6శాతం నుంచి 14 శాతం వరకు జీడీపీ వృద్దిని సాధించాయి. కానీ యూరోప్ దేశాలన్నీ ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. 

 today-latest-news-in-telugu | india | gdp | china 

Also Read: USA: పత్రాల్లేవని కుక్కను చంపి ఫ్లైట్ ఎక్కింది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు