/rtv/media/media_files/2025/03/29/mUfJtyVKm28S62OF2bQa.jpg)
Earthquake in afganisthan Photograph: (Earthquake in afganisthan)
మయన్మార్, బ్యాంకాక్‌లో శుక్రవారం మధ్యహ్నం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసింది. శనివారం ఉదయం భారత్ మరో పొరుగు దేశంలో భూకంపం నమోదైంది. అఫ్గనిస్థాన్‌లో శనివారం ఉదయం 5 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. తీవ్రత తక్కువ ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. శుక్రవారం ఈశాన్య భారత్‌లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్, భారత్, చైనా దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Read also : భారీ భూకంపం.. 200 మందికి పైగా మృతి
Series of Earthquakes Hit Asia:
— khaled mahmoued (@khaledmahmoued1) March 29, 2025
Tremors in Afghanistan and Thailand Within Hours
A 4.7-magnitude earthquake struck Afghanistan, just hours after a 6.0-magnitude quake shook Thailand. No major casualties have been reported, but the tremors caused panic among residents.… pic.twitter.com/y76Kj7zXeQ
Also read:GST Notices: రోజుకు రూ.500 సంపాధించేవారికి.. రూ.6 కోట్ల ట్యాక్స్ కట్టాలని నోటీసులు
శుక్రవారం మయన్మార్‌లో రెండవసారి సంభవించిన భూకంపం తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించింది. భారీ భూకంపం వచ్చే ముందు స్వల్పంగా భూమి కంపనలకు గురవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అఫ్గానిస్థాన్‌లో కూడా అతి భయంకరమైన భూకంపం సంభవించే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.
An earthquake with a magnitude of 4.7 on the Richter Scale hit Afghanistan at 5.16 IST today
— ANI (@ANI) March 29, 2025
(Source - National Center for Seismology) pic.twitter.com/PkfTSO1k6v