/rtv/media/media_files/2025/03/30/ooAyUTRYGa5bH8Rp7UWj.jpg)
Nurses shield newborns in China amid Myanmar earthquake
మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపాలు పెను విషాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపాల ధాటికి ఇప్పటివరకు 1600 మందికి పైగా మృతి చెందారు. మ-ృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మయన్మార్‌లో తలెత్తిన ఈ భూకంపం ప్రభావం థాయ్‌లాండ్‌తో భారత్, బంగ్లాదేశ్, వియత్నాం చైనాలపై కూడా పడింది. అయితే చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ పిల్లల ఆస్పత్రిలో భూ ప్రకంపనలు వచ్చాయి.
Also Read: పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కారులో బాంబు పేలుడు
ఈ సమయంలో ఆరుగురు నవజాత వార్డులో ఉన్నారు. ప్రకంపనలు తీవ్రత పెరుగుతున్నా కూడా అక్కడున్న సిబ్బంది భయంతో పారిపోలేదు. అక్కడే ఉండి శిశువులను కాపాడేందుకు యత్నించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్యయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Atouching moment during the tragedy:
— China in Pictures (@tongbingxue) March 28, 2025
The earthquake in Myanmar was felt in Ruili, Yunnan, China, where two nurses at Jingcheng Hospital's maternity center were seen shielding infants: pic.twitter.com/xDNqPAb9tt
Also Read: కుక్కలను తప్పించుకోబోయి బావిలో.. 3 రోజులు అక్కడే! తర్వాత ఏం జరిగిందంటే...
ఈ వీడియో గమనిస్తే.. భూ ప్రకంపనల తీవ్రతకు ఆ వార్డులో ఉన్న నవజాత శిశువుల బెడ్‌లు చెల్లచెదురైపోయాయి. అక్కడ ఇద్దరు మహిళా సిబ్బంది ఉన్నారు. ఒకరు నేలపై కూర్చోని ఒక చెత్తో శిశువును ఎత్తుకున్నారు. మరొకరు కదులుతున్న శిశువుల బెడ్లని పట్టుకున్నారు. ప్రకంపనలు వచ్చినప్పటికీ తమ ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారులను కాపాడేందుకు యత్నించిన ఆ మహిళా సిబ్బందిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: ఆ విలయం ..334 అణుబాంబుల విధ్వంసంతో సమానం!
rtv-news | massive earthquake in myanmar