Tamil Nadu assembly elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహనాల్లో ఉన్న 11 మంది బయటకు వచ్చే అవకాశం లేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్లో మాత్రం తొలి విడత కింద 152 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు చేసింది. కొడగులో ఈ అమానుష ఘటన జరిగింది. అక్కడ హోమ్ స్టే చేసిన ఆ మహిళపై ఓ దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన రూ. 102 కోట్ల భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు ఊరట లభించింది. గతేడాది నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో రిమాండ్లో ఉన్న ఆమెకు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పహల్గాం మారణకాండ జరిగి ఏడాది పూర్తయిన తరుణంలో, ఈ ఘోరకలికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రూ. 3 వేల కోసం ఇద్దరు స్థానికులు చేసిన ద్రోహం 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొందని దర్యాప్తులో తేలింది.
భూతల స్వర్గం కశ్మీర్ లోని పర్యాటకుల స్వర్గధామమైన పహల్గాంలో ఇంకా నిశ్చబ్ధం రాజ్యమేలుతోంది. పర్యాటకుల నవ్వులతో కళకళలాడాల్సిన ఆ లోయ, తుపాకుల మోతతో వణికిపోయింది. అమాయకుల రక్తంతో ఆ తెల్లని మంచు ప్రాంతం ఎర్రబడింది. ఆ విషాద ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై జరిగిన ఆ కిరాతక దాడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. 2025, ఏప్రిల్ 22న జరిగిన ఆ రక్తపాతం దేశాన్నికలిచివేసింది. దానికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' వంటి భారీ ప్రతీకార చర్యకు దిగాల్సి వచ్చింది.
బెంగళూరు నగరంలో అత్యంత కిరాతకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పిలిచి, నమ్మించి ఓ యువతి తన ప్రియుడిని సజీవదహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రియుడిని కుర్చికి కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టింది యువతి.