BIG BREAKING: రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు.. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా ముర్షిదాబాద్ జిల్లా నవోడ నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శివనగర్ గ్రామంలో అధికార TMC, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) మద్దతుదారుల మధ్య గొడవలు జరిగాయి.

New Update
West Bengal Assembly Elections 2026, Clashes break out between AJUP, TMC workers in Murshidabad

West Bengal Assembly Elections 2026 Clashes break out between AJUP, TMC workers in Murshidabad

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా ముర్షిదాబాద్ జిల్లా నవోడ నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శివనగర్ గ్రామంలో అధికార TMC, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) మద్దతుదారుల మధ్య గొడవలు జరిగాయి. ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు, ఇటుకలతో తీవ్రంగా దాడులు చేసుకున్నారు.  వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

అసలేం జరిగింది ?

ఏజేయూపీ (AJUP) చీఫ్ హుమాయూన్ కబీర్ ఓటు వేసిన అనంతరం శివనగర్ గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న TMC మద్దతుదారులు ఆయనను అడ్డుకున్నారు. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. ఆయన్ని "బీజేపీ ఏజెంట్" అని ముద్ర వేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో కబీర్ అక్కడే బైఠాయించారు. టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను భయపెడుతున్నారని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు తమ పార్టీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలంటూ టీఎంసీ లంచం ఇచ్చినట్లు విమర్శలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రాళ్లు, ఇటుకలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. 

 నవోడ నియోజకవర్గంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఇరు పార్టీల మధ్య జరిగిన గొడవపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌లోని 152 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ అక్కడక్కడ మినహా ప్రశాంతంగా సాగుతోంది. నవోడలో జరిగిన ఈ ఘర్షణ కలకలం రేపుతోంది. ఇక రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా.. మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

Advertisment
తాజా కథనాలు