Pahalgam Attack : పహల్గాం దాడి.. రూ. 3 వేల కోసం 26 మంది ప్రాణాలు పణంగా..

పహల్గాం మారణకాండ జరిగి ఏడాది పూర్తయిన తరుణంలో, ఈ ఘోరకలికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రూ. 3 వేల కోసం ఇద్దరు స్థానికులు చేసిన ద్రోహం 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొందని దర్యాప్తులో తేలింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

Pahalgam Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం మారణకాండ(pahalgam army operation) జరిగి ఏడాది పూర్తయిన తరుణంలో, ఈ ఘోరకలికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రూ. 3 వేల కోసం ఇద్దరు స్థానికులు చేసిన ద్రోహం 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొందని దర్యాప్తులో తేలింది. ఈ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

గత ఏడాది ఏప్రిల్ 21 రాత్రి 10:30 గంటల సమయంలో, ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు పహల్గాంకు చెందినపర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు స్థానికుల వద్ద ఆశ్రయం పొందారు. ఆ సమయంలో ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయని, వారు ఉర్దూ, పంజాబీ భాషల్లో మాట్లాడుకున్నారని ఎన్ఐఏ గుర్తించింది. లష్కరే తొయిబా కమాండర్ సాజిద్ జాట్ (అలియాస్ అలీభాయ్) గురించి వారు చర్చించుకోవడం పర్వేజ్, బషీర్‌లకు స్పష్టంగా వినిపించింది.

ఉగ్రవాదులు తమ ప్రాంతంలో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నారని ఆ ఇద్దరు స్థానికులకు అర్థమైనప్పటికీ, వారు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. సుమారు ఐదు గంటల పాటు ఉగ్రవాదులకు తమ వద్దే ఆశ్రయం కల్పించి, భోజనం కూడా పెట్టారు. ఇందుకు ప్రతిఫలంగా ఉగ్రవాదులు వారికి కేవలం రూ. 3 వేలు ఇచ్చారు. ఈ చిన్న మొత్తానికి ఆశపడి వారు మారణకాండకు పరోక్షంగా సహకరించారు.

Also Read :  పహల్గాం దాడికి ఏడాది పూర్తి... ప్రతి భారతీయుడి కళ్లలో రక్తంప్రవహించిన రోజు

Pahalgam Attack

ఏప్రిల్ 22 మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో, ఆ ముగ్గురు ఉగ్రవాదులు బైసరాన్ లోయలోని ఒక కంచె వెనుక దాక్కుని ఉండటాన్ని పర్వేజ్, బషీర్ గమనించారు. దాడికి కొన్ని గంటల ముందే ముష్కరుల కదలికలు తెలిసినా, వారు అటు పోలీసులకు గానీ, ఇటు తోటి టూరిస్ట్ ఆపరేటర్లకు గానీ హెచ్చరికలు చేయలేదు.

నిందితులు ఇద్దరూ తమ గుర్రాల సవారీ కోసం పర్యాటకులు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూశారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో పర్యాటకులు రాగానే, వారిని ఏమాత్రం సంకోచం లేకుండా ఉగ్రవాదులు మాటు వేసిన బైసరాన్ లోయకే తీసుకెళ్లారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే కాల్పుల మోత మొదలై లోయ మొత్తం రక్తసిక్తమైంది. ఆ భయానక వాతావరణం చూసి కూడా, తమకేమీ తెలియనట్లుగా పర్వేజ్, బషీర్ అక్కడి నుంచి మౌనంగా జారుకున్నారు.

ఘటనపై లోతుగా విచారణ జరిపిన ఎన్ఐఏ అధికారులకు, ఈ ఇద్దరు స్థానికులపై అనుమానం రావడంతో గతేడాది జూన్ 22న వారిని అరెస్టు చేశారు. ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో లష్కరే కమాండర్ సాజిద్ జాట్‌తో పాటు, ఉగ్రవాదులకు సహకరించిన పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌లను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.

నేటికీ ఆ 26 కుటుంబాలు తమ వారిని కోల్పోయిన బాధలో కొట్టుమిట్టాడుతున్నాయి. కేవలం స్వల్ప ధనం కోసం ఉగ్రవాదులకు సహకరించిన ఈ ఇద్దరి ద్రోహం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దేశద్రోహానికి పాల్పడిన వీరిద్దరికీ కఠిన శిక్ష పడాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read :  పెళ్లి వేడుకలో ఫుడ్‌ పాయిజన్.. 400 మందికి అస్వస్థత

Advertisment
తాజా కథనాలు