Uttarpradesh: ఢీకొన్న రెండు వాహనాలు.. స్పాట్‌లో 11 మంది సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహనాల్లో ఉన్న 11 మంది బయటకు వచ్చే అవకాశం లేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

New Update
Uttarpradesh

Uttarpradesh

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వేగంగా వెళ్తున్న ఓ భారీ ట్రక్కు అదుపు తప్పి ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి కారు వెళ్లి పక్కనే ఉన్న మరో బొలేరో వాహనాన్ని ఢీకొనడంతో ఊహించని విధంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది బయటకు వచ్చే అవకాశం లేక లోపలే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు ప్రక్రియ కష్టంగా మారింది. 

ఇది కూడా చూడండి: IRGC Attacks: హర్మూజ్‌ జలసంధిలో గందరగోళం.. భారతీయ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్

ఇది కూడా చూడండి: BIG BREAKING: కాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పు.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌

Advertisment
తాజా కథనాలు