కర్ణాటకలో దారుణం.. అమెరికా మహిళపై అత్యాచారం..

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు చేసింది. కొడగులో ఈ అమానుష ఘటన జరిగింది. అక్కడ హోమ్‌ స్టే చేసిన ఆ మహిళపై ఓ దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

New Update
US Woman Raped At Homestay in karnataka

US Woman Raped At Homestay in karnataka

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు చేసింది. కొడగులో ఈ అమానుష ఘటన జరిగింది. అక్కడ హోమ్‌ స్టే చేసిన ఆ మహిళపై ఓ దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చివరికి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొడగు జిల్లాలోని కుట్టా గ్రామంలో జార్ఖండ్‌కు చెందిన వృజేష్‌కుమార్‌ అనే వ్యక్తి ఓ హోమ్‌స్టే పనిచేస్తున్నాడు.  

Also Read: నటి రన్యా రావుకు బెయిల్‌.. ఏడాది తర్వాత జైలు నుంచి రిలీజ్

ఆ హోమ్‌స్టేకు ఓ అమెరికన్ మహిళ వచ్చింది. ఆమెపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత  బాధితురాలు ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా ఉండేందుకు అక్కడున్న వైఫైని మూడు రోజుల పాటు ఆఫ్ చేశాడు. ఆ సమయంలోనే ఆమెకు మత్తుమందు కూడా ఇచ్చి ఎవరినీ కలవనీయకుండా చేసినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు హోమ్‌స్టే యజమాని కూడా ప్రయత్నాలు చేశారు. చివరికి ఆమె మైసూరు వెళ్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంది. 

Also read: పహల్గాం దాడి.. రూ. 3 వేల కోసం 26 మంది ప్రాణాలు పణంగా..

ఆ తర్వాత అమెరికా ఎంబసీకి ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఎంబసీ అధికారులు మైసూరు పోలీసులకు దీనిపై మెయిల్‌ పంపించారు. కుట్టా పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడితో పాటు హోమ్‌ స్టే యజమానిని అరెస్టు చేశారు. వచ్చే నెల 3వ తేదీ వరకు వీళ్లకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.   

Advertisment
తాజా కథనాలు