BREAKING: నటి రన్యా రావుకు బెయిల్‌.. ఏడాది తర్వాత జైలు నుంచి రిలీజ్

కర్ణాటకలో సంచలనం సృష్టించిన రూ. 102 కోట్ల భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు ఊరట లభించింది. గతేడాది నుంచి  బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో రిమాండ్‌లో ఉన్న ఆమెకు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

New Update
Actress Ranya Rao Set For Release After One Year COFEPOSA Detention

Actress Ranya Rao Set For Release After One Year COFEPOSA Detention


కర్ణాటకలో సంచలనం సృష్టించిన రూ. 102 కోట్ల విలువైన భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు ఊరట లభించింది. గతేడాది నుంచి  బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో రిమాండ్‌లో ఉన్న ఆమెకు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె ఈరోజు జైలు నుంచి విడుదల కానున్నారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కస్టమ్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గతేడాది అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. సుదీర్ఘ కాలం పాటు ఆమెపై  విచారణ జరిపారు. 

Also Read: పహల్గాం దాడి.. రూ. 3 వేల కోసం 26 మంది ప్రాణాలు పణంగా..

వాస్తవానికి రన్యా రావుకు 2025 మే లోనే సాధారణ బెయిల్ వచ్చింది. కానీ స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆమెపై కేసు నమోదు కావడంతో ఆమె విడుదల కాలేదు. విదేశీ మారకద్రవ్య పరిరక్షణ రూల్స్‌ను ఉల్లంఘించినట్లు రన్యారావుపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా అధికారులు అదుపులోనే ఉంచారు. దీనివల్ల గతేడాది నుంచి  ఆమె జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా ఆ చట్టం పరిధిలోని కఠిన నిబంధనల నుంచి కూడా ఓ న్యాయపరమైన వెసులుబాటు లభించింది. ఈ క్రమంలోనే ఆమెకు తాజాగా బెయిల్ మంజూరయ్యింది. 

Also Read: పహల్గాం గుండె మీద మానని గాయం... నిశ్చబ్ధం రాజ్యమేలుతున్న "బైసరన్‌'

రన్యా రావు విడుదల కానుండటంతో ఈ వ్యవహారం చర్చనీయమవుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోవాలని అనుకున్న కన్న నటి, ఇలా భారీ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆమె విడుదల కానుండటంతో జైలు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జైలు నుంచి బయటికొచ్చాక ఆమె ఈ గోల్ట్ స్కామ్‌పై ఎలా స్పందిదిస్తో అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Advertisment
తాజా కథనాలు