Assembly Elections 2026: నేడే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు!

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం తొలి విడత కింద 152 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

New Update
elections

elections

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections 2026) ల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం తొలి విడత కింద 152 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తమిళనాడులో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కూటములతో పాటు ప్రముఖ సినీ నటుడు విజయ్(tvk vijay) స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. అయితే మొత్తం 4,023 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. - breaking-news

ఇది కూడా చూడండి: IRGC Attacks: హర్మూజ్‌ జలసంధిలో గందరగోళం.. భారతీయ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్

ఇది కూడా చూడండి: BIG BREAKING: కాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పు.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌

మొదటి విడతలో..

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తొలి విడతలో భాగంగా 152 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొంటున్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బెంగాల్‌లో ఎన్నికల హింసను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాయి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఈసారి పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Britain: మధ్య ఆసియాపై కన్నేసిన బ్రిటన్.. రష్యా, చైనాలకు పోటీగా బిగ్ ప్లాన్

ఇది కూడా చూడండి: కర్ణాటకలో దారుణం.. అమెరికా మహిళపై అత్యాచారం..

Advertisment
తాజా కథనాలు