Tamil Nadu assembly elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

New Update
Votes

Votes

తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈ ఎన్నికల్లో సుమారు 5.73 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 4,023 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇది కూడా చూడండి: Britain: మధ్య ఆసియాపై కన్నేసిన బ్రిటన్.. రష్యా, చైనాలకు పోటీగా బిగ్ ప్లాన్

అన్బుమణి రామదాస్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.   అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో నేడు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, ఈ రోజును రాష్ట్రానికి ఒక రకమైన 'స్వాతంత్ర్య దినోత్సవం'గా తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి మార్పు కోసం ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

కమల్ హాసన్, శృతి హాసన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్(Kamal Hassan) తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి సాధారణ ఓటర్లలాగే క్యూలైన్‌లో నిలబడి వారు ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తండ్రీకూతుళ్లు కోరారు.

టీవీకే అధినేత విజయ్
తమిళనాడు(tamil-nadu) అసెంబ్లీ ఎన్నిక(assembly-elections) ల పోలింగ్ సందర్భంగా 'తమిళగ వెట్రి కళగం' పార్టీ అధ్యక్షుడైన ప్రముఖ నటుడు విజయ్(tvk vijay) చెన్నైలోని నీలాంకరైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన వేస్తున్న తొలి ఓటు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే విజయ్ సాధారణ పౌరుడిలా క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు. అనంతరం తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ, ఓటర్లందరూ బాధ్యతగా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు.

ఇది కూడా చూడండి: కర్ణాటకలో దారుణం.. అమెరికా మహిళపై అత్యాచారం..

సూపర్ స్టార్ రజనీకాంత్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరిస్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన సాధారణ పౌరుడిలా ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రజనీకాంత్‌ను చూసేందుకు అభిమానులు పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా తరలివచ్చారు. 

అజిత్ కుమార్
తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన కేంద్రానికి చేరుకుని, క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆయన త్వరగా ఓటు వేసి వెళ్లిపోయారు. 

ఇది కూడా చూడండి: IRGC Attacks: హర్మూజ్‌ జలసంధిలో గందరగోళం.. భారతీయ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్

ధ్రువ్ విక్రమ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ధ్రువ్ విక్రమ్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ పౌరుడిలా పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటేశారు. ఆ తర్వాత తన వేలికి ఉన్న సిరా చుక్కను మీడియాకు చూపించారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: కాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పు.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌

Advertisment
తాజా కథనాలు