/rtv/media/media_files/2025/03/29/wrgo4HnkqaPtk9wadaBn.jpg)
Ugadi Sri Vishwavasu Photograph: (Ugadi Sri Vishwavasu)
హిందువులు తప్పకుండా జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి. ప్రత్యేకమైన ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంటిల్లా పాలిది కొత్త దుస్తులు ధరించి ఈ ఉగాది పండును నిర్వహిస్తారు. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగను ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కొత్త సంవత్సరం మార్చి 30వ తేదీన నిర్వహిస్తారు. అయితే తెలుగు క్యాలెండర్‌లో మొత్తం 60 సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతీ ఏడాది ఒక్కో కొత్త సంవత్సరం వస్తుంది. అయితే ఈసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వస్తోంది.
ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
ఈ ఏడాది శుభ ఫలితాలు..
ప్రతీ కొత్త సంవత్సరానికి ఓ అర్థం ఉన్నట్లే.. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి కూడా ఓ అర్థం ఉంది. శ్రీ అనేది పవిత్రత, శుభత, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. విశ్వావసు అంటే ప్రపంచానికి శుభములు అందుతాయని అర్థం. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం శుభాన్ని, ఐశ్వర్యాన్ని అందించే సంవత్సరమని అర్థం. ఈ ఏడాదిలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా మందికి ఎక్కువగా శుభ ఫలితాలు వస్తాయి.
ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయని, చాలా మంది కుటుంబాల్లో సంతోషంగా ఉంటుందట. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం కూడా క్లోజ్ అవుతుందని పండితులు చెబుతున్నారు. క్రోధి నామ సంవత్సరం నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి వెళ్తున్నాం. క్రోధి అంటే కోపం. ఈ ఏడాది ప్రతీ ఒక్కరూ కూడా కోపంగా ఉండటం వంటివి జరిగాయి. కానీ కొత్త ఏడాదిలో అంతా కూడా మంచి జరుగుతుందని, అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్
UGADI 2025 | ugadi-festival | latest-telugu-news | latest telugu news updates | today-news-in-telugu | human-life-style | Latest Life style news | astrology | Hindu Astrology